Pushpa 2 The Rule: పుష్ప పార్ట్ 1 కంటే పార్ట్ 2 లాభాలు తక్కువే..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  (Allu Arjun) నటించిన ‘పుష్ప 2: ది రూల్’ (Pushpa 2 The Rule)  బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. తెలుగు, హిందీ, ఇతర భాషల్లో భారీ వసూళ్లు సాధిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే 1000 కోట్ల గ్రాస్ మార్క్ దాటింది. దేశవ్యాప్తంగా ట్రేడ్ సర్కిల్స్ లో ఈ సినిమా హిట్ స్టాటస్‌ను రుజువు చేసుకుంటోంది. అయితే ఫస్ట్ పార్ట్ లాభాలతో పోలిస్తే, సీక్వెల్ లాభ శాతం తగ్గిందని విశ్లేషకులు చెబుతున్నారు. 2021లో విడుదలైన ‘పుష్ప: ది రైజ్’ (Pushpa)  హిందీ మార్కెట్‌లో ఆశించిన దానికన్నా ఎక్కువ రీతిలో విజయాన్ని సాధించింది.

Pushpa 2 The Rule

అప్పట్లో ఈ సినిమాను హిందీ బెల్ట్‌లో కేవలం రూ.12 కోట్ల థియేట్రికల్ బిబిజినెస్ తో మాత్రమే రిలీజ్ చేయగా రూ.106 కోట్లు వసూలు చేసి, భారీ లాభాలను అందించింది. అల్లు అర్జున్ పాన్ ఇండియా క్రేజ్‌కు ఈ సినిమా దారి సాఫీ చేసింది. ఇదే స్థాయిలో ‘పుష్ప 2’ కూడా నార్త్ లో దూసుకుపోతోంది. అయితే ఖర్చు భారీగా పెరగడం వల్ల లాభాల శాతం తగ్గిందని ట్రేడ్ అనలిస్ట్‌లు విశ్లేషిస్తున్నారు.

‘పుష్ప 2’ హిందీ మార్కెట్ కోసం దాదాపు రూ.200 కోట్లు ఖర్చు చేసినట్లు టాక్. విడుదలైన ఆరు రోజుల్లో ఈ చిత్రం రూ.250 కోట్లను హిందీ బెల్ట్‌లో రాబట్టింది. ఇది 120% లాభాలను అందించగా, మొదటి పార్ట్ 430% లాభాలు రాబట్టిన నేపథ్యంలో ఈ శాతం తక్కువగానే కనిపిస్తోంది. నార్త్ బెల్ట్‌లో పుష్ప సీక్వెల్ ప్రాఫిట్ సాధించినప్పటికీ, ఫస్ట్ పార్ట్ లాగా భారీ ప్రాఫిట్స్ సాధించడం కష్టసాధ్యమే అనిపిస్తోంది. ‘పుష్ప 2’ ప్రస్తుతం హిందీ మార్కెట్‌లో బాహుబలి-2 (Baahubali 2) రికార్డులను దాటే ప్రయత్నం చేస్తోంది.

అయితే, రూ.1000 కోట్ల మార్క్ టచ్ చేయడం సాధ్యమవుతుందా అనేది చూడాల్సి ఉంది. సీక్వెల్‌కు భారీ హైప్ ఉన్నా, భారీ ఖర్చుతో ఈ సినిమా లాభ శాతాన్ని తగ్గించింది. అయితే, గ్లోబల్ స్థాయిలో సినిమా విజయవంతంగా నడుస్తుండటం మాత్రం హర్షణీయమైన విషయం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో అల్లు అర్జున్‌కు జోడీగా రష్మిక మందన్న(Rashmika Mandanna) నటించగా, శ్రీలీల (Sreeleela)   ప్రత్యేక గీతంలో మెరిసింది. ఫహాద్ ఫాజిల్  (Fahadh Faasil), అనసూయ భరద్వాజ్  (Anasuya Bhardhwaj) , జగపతి బాబు (Jagapathi Babu) వంటి కీలక నటులు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ప్రపంచమంతా వెతికి… ఆఖరికి మన హీరోయిన్‌నే ఫైనల్‌ చేశారా?

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus