Mahesh Babu: ప్రపంచమంతా వెతికి… ఆఖరికి మన హీరోయిన్‌నే ఫైనల్‌ చేశారా?

మహేష్‌బాబు (Mahesh Babu) – రాజమౌళి (S. S. Rajamouli) సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గత కొన్ని నెలలుగా ఈ పని జరుగుతూనే ఉంది. ఓవైపు కథ, కథనం విషయంలో రాజమౌళి టీమ్‌ బిజీగా ఉన్నారు. ఆయన అండ్‌ కుటుంబం అయితే కీరవాణి తనయుడు శ్రీ సింహ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ లోపు కొత్త పుకారు ఒకటి బయటికొచ్చింది. దాని ప్రకారం చూస్తే హీరోయిన్‌ ఫిక్స్‌ అయినట్లే అని అంటున్నారు.

Mahesh Babu

రాజమౌళి – మహేష్‌బాబు కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కాల్సి ఉన్న విషయం తెలిసిందే. అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఈ పాటికి సినిమా సెట్స్‌ మీదకు వెళ్లేది. అయితే ఏమైందో ఏమో.. సినిమాకు క్లాప్‌ ఇంకా పడటం లేదు. ఇదిగో, అదిగో అని 2024 అంతా చెప్పిన టీమ్‌ ఆ పని చేయలేదు. దీంతో వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత సినిమా ప్రారంభం ఉంటుంది అని అంటున్నారు.

ఈ క్రమంలో సినిమా టీమ్‌ హీరోయిన్‌ విషయంలో ఫిక్స్‌ అయింది అని చెబుతున్నారు. చాలా నెలలుగా చెబుతున్నట్లుగా ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉన్న హీరోయిన్‌నే ఎంపిక చేశారు. అయితే ఆమె ఇండియన్‌ హీరోయినే కావడం గమనార్హం. ఈ సినిమా కోసం హాలీవుడ్‌ నుండి, కొరియా నుండి, జపాన్‌ నుండి హీరోయిన్‌ను తీసుకొస్తాం అని చెప్పారు. కానీ ఇప్పుడు మన హీరోయిన్‌నే ఓకే చేశారు అని అంటున్నారు.

ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉన్న హీరోయిన్‌ కోసం విదేశాలకు వెళ్లడం ఎందుకు అనుకున్నారేమో.. మన దగ్గర నుండి విదేశాలకు వెళ్లి గ్లోబల్‌ స్టార్‌ అయిన ప్రియాంక చోప్రాను ఎంపిక చేశారు అని చెబుతున్నారు. ఇటు బాలీవుడ్‌, అటు హాలీవుడ్‌ను కూడా కవర్‌ చేసేలా ఆమె ఎంపిక జరిగింది అని అంటున్నారు. మరి ఈమె అయినా ఫైనల్‌ అవుతుందా లేదా అనేది చూడాలి. ఇప్పటికే ప్రియాంక చోప్రా (Priyanka Chopra) రామ్‌చరణ్‌తో (Ram Charan) ‘తుఫాన్‌’ (Thoofan) అనే సినిమా చేసిన విషయం తెలిసిందే.

వెంకీ అట్లూరి.. మళ్ళీ తమిళ హీరోనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus