కరోనాతో కుదేలైన చిత్ర పరిశ్రమను పట్టాలెక్కించడానికి ‘పుష్ప’ సినిమా విజయం ఎంత ఉపయోగపడిందో తెలిసిందే. సౌత్ సినిమా మొదలై, పాన్ ఇండియా సినిమాగా విడుదలై ఆ సినిమాకు బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. బన్నీ సినిమా కాబట్టి… తెలుగు, మలయాళంలో బాగా ఆడుతుంది అని అనుకుంటే.. మొత్తంగా దేశాన్నే షేక్ చేసింది. ఇప్పుడు విదేశాల మీద దృష్టి సారిస్తున్నారు. అయితే రెండో ‘పుష్ప’రాజ్‌ను ఇంటర్నేషనల్ లెవల్‌లో భారీగా విడుదల చేద్దామని చూస్తున్నారట. ‘పుష్ప 2’ అదేనండీ ‘పుష్ప: ది రూల్’ ఇటీవల మొదలైంది.
మొదలవ్వడం కాస్త ఆలస్యమైనా విడుదల విషయంలో చిత్రబృందం పక్కా ప్రణాళికల్నే రచించినట్టు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనే వ్యూహంతో ఇప్పటి నుండే ప్రణాళికలు రచిస్తున్నారట. 20కి పైగా దేశాల్లో సినిమాను ఒకేసారి విడుదల చేయాలనే లక్ష్యంతో ప్లాన్స్ వేస్తోందట మైత్రీ టీమ్ అండ్ సుకుమార్ టీమ్. ‘పుష్ప: ది రైజ్’ సినిమాకు వచ్చిన స్పందనను, బజ్‌ను, క్రేజ్‌ను కొనసాగిస్తూ.. ‘పుష్ప: ది రూల్’ని తీసుకొస్తారట.
దీని కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో సినిమాను తెరకెక్కించడంతోపాటు, ఒకేసారి వివిధ భాషల్లో విడుదల చేయాలని అనుకుంటున్నారట. దాంతోపాటు తొలి పార్టు విషయంలో ఆఖరులో కంగారు పడిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుంటున్నారట. అలాంటి ఇబ్బందులు లేకుండా ప్లానింగ్ వేసి, రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారట. దీని కోసం పక్కా ప్లాన్స్ రెడీ చేసుకునే బరిలోకి దిగారట.
‘పుష్ప: ది రైజ్’ డిసెంబరు 8న రష్యాలో విడుదల కానుంది.
దీంతో చిత్రబృందం అక్కడ ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటోంది. అక్కడి నుండి తిరిగి స్వదేశానికి వచ్చాక… షూటింగ్ మొదలుపెడతారట. వన్స్ మొదలయ్యాక ఇక ‘ఆగేది లే..’ అంటూ సాగిపోతారట. ఈ సినిమాలో కొత్త నటులు కనిపిస్తారని కూడా టాక్ వినిపిస్తోంది. అంటే తొలి పార్టులో లేని కొత్త పాత్రలు ఇందులో వస్తాయట. అలాగే స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీని తీసుకొస్తున్నారని టాక్. విలన్ల సంఖ్య కూడా పెరుగుతుందని సమాచారం.
హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!