Pushpa3: ‘పుష్ప: అగైన్‌’ కాన్సెప్ట్‌ ఓకే అనుకున్నారా?.

  • December 15, 2022 / 05:28 PM IST

ఒక సినిమాకు సీక్వెల్‌ అంటేనే భయపడుతున్న రోజులివి. అయితే మేం చెప్పేది టాలీవుడ్‌ కోసం మాత్రమే. ఎన్నో పెద్ద హీరోల సినిమా సీక్వెల్స్‌ తీసి చేతులు కాలాయి. అయితే ‘బాహుబలి 2’ వచ్చి ఆ భయాలను పోగొట్టింది. ‘పుష్ప 2’ ఇప్పుడే అదే కోవలో తెరకెక్కుతోంది. అయితే ‘పుష్ప 3’ కూడా ఉందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ‘పుష్ప’ సినిమాకు మరో సీక్వెల్‌ రూపొందించాలని టీమ్‌ అనుకుంటోందట. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ‘పుష్ప 3’ను తీసుకొస్తారని టాక్‌ నడుస్తోంది.

నిజానికి ‘పుష్ప’ క‌థ రాస్తున్న‌ప్పుడు దర్శకుడు సుకుమార్‌కి రెండు భాగాలుగా తీయాల‌నే ఆలోచ‌నే లేదు. షూట్‌ ప్రారంభించాక నిడివి ఎక్కువ‌వ్వ‌డంతో పార్ట్ 1, పార్ట్ 2 అంటూ రెండు భాగాలులుగా విడ‌గొట్టారు. తొలి పార్ట్‌కి ‘పుష్ప: ది రైజ్‌’ అని పేరు పెట్టి విడుదల చేశారు. సినిమా అఖరున ‘పుష్ప: ది రూల్‌’ అనే పేరుతో రెండో భాగంగా తీసుకొస్తామని చెప్పేశారు. అయితే ఇప్పుడు ‘పుష్ప 3’ కూడా ఉంది అంటున్నారు. అంతేకాదు ఈ సినిమా కోసం ఓ కాన్సెప్ట్‌ కూడా ఓకే అనుకున్నారట.

‘పుష్ప 2’ ఆఖరున కేశవ మరో ‘పుష్ప’రాజ్‌ అవుతాడని ఆ మధ్య వార్తలు, ఫొటోలు వచ్చాయి. మరి ‘పుష్ప 3’ ఎలా సాధ్యం అనే డౌట్‌ మీకు రావొచ్చు. అయితే కేశవ.. ‘పుష్ప’రాజ్‌గా మారడం వెనుక ఓ ట్విస్ట్‌ ఉందని, దాంతోనే మళ్లీ ‘పుష్ప’రాజ్‌ని మూడోసారి థియేటర్లకు తీసుకొస్తారని చెబుతున్నారు. రెండో ‘పుష్ప’ ఆలస్యంగా ప్రారంభం కావడానికి మూడో ‘పుష్ప’ ఉండటమే ఓ కారణం అని చెబుతున్నారు. ‘పుష్ప’ తొలి భాగంలో ‘పుష్ప’రాజ్‌ అనే కూలీ స్మ‌గ్ల‌ర్‌గా ఎలా ఎదిగాడో చూపించారు.

పార్ట్ 2లో అత‌ను ఆ ప్రాంతాన్ని, వ్యాపారాన్ని ఎలా ఏలాడో చూపిస్తారు. ఆఖరున ప‌త‌నం కూడా చూపిస్తారని టాక్‌. అంటే హీరో అయితే పుష్ప జీరోకి ప‌డిపోయి, మ‌ళ్లీ హీరోగా ఎద‌గ‌డ‌మే పార్ట్ 3 అని అంటున్నారు. అయితే దీనిపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదట. అంతేకాదు ‘పుష్ప 2’ తర్వాత సుకుమార్‌ వేరే హీరోలతో సినిమాలు చేయాలి, మరోవైపు బన్నీ పరిస్థితి కూడా అంతే. అందుకే ఐదారేళ్ల తర్వాతే ‘పుష్ప 3’ ఉండొచ్చు అంటున్నారు. ‘పుష్ప: రైజ్‌ అగైన్‌’,‘పుష్ప: అగైన్‌’ లాంటి పేర్లు అప్పుడే చర్చలోకి కూడా వచ్చేశాయి.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus