Allu Arjun,Kuba: ‘పుష్ప 2’ కొత్త ఫొటో షేర్‌ చేసిన సినిమాటోగ్రాఫర్‌!

ఓ సినిమాకు స్టార్టింగ్‌ ఒకసారే ఉంటుంది. వారానికోసారి, నెలకోసారి స్టార్టింగ్‌లు ఉండవు. అయితే ‘పుష్ప 2’ విషయంలో కొద్ది రోజులుగా ఈ స్టార్టింగ్‌ అనే మాట వినిపిస్తూనే ఉంది. ఒక్కోసారి ఒక్కొకరు చెబుతూనే ఉన్నారు. దీంతో అసలు సినిమా రెండో పార్టు మొదలైందా… ఎవరితో మొదలైంది.. అనేది తెలియడం లేదు. మొన్నామధ్య సినిమాను లాంఛనంగా ముహూర్తంతో ప్రారంభించారు అని ఫొటోలు రిలీజ్‌ చేశారు. ఆ తర్వాత మూడు, నాలుగుసార్లు స్టార్టింగ్‌ అనే మాట వినిపించింది. దీంతో ‘పుష్ప’రాజ్‌ ఆట మొదలుపెట్టాడా? లేదా? అనేది తెలియడం లేదు.

‘పుష్ప’ సినిమా గతేడాది డిసెంబరులో విడుదైనప్పుడు ప్రచారంలో టీమ్‌.. సినిమా రెండోపార్టును త్వరలోనే ప్రారంభిస్తాం అని చెప్పారు. ఆ త్వరలో అనే మాటకు పక్కాగా ఓ తేదీ ఉండదు కాబట్టి.. త్వరలో త్వరలో అంటూ వాయిదా పడుతూనే ఉంది. ఎట్టకేలకు ఆగస్టు 22న సినిమాను స్టార్ట్‌ చేశారు. అయితే అప్పుడు రెగ్యులర్‌ షూట్‌ ప్రారంభించలేదు. ‘అల్లు స్టూడియోస్‌’ ప్రారంభోత్సవం సందర్భంగా ఇక్కడే ‘పుష్ప 2’ షూటింగ్‌ త్వరలో ప్రారంభం అన్నారు. కానీ అదీ జరగలేదు.

దీంతో ఈ సినిమా అసలు ఎప్పుడు మొదలవుతుంది అని అందరూ ప్రశ్నించసాగారు. ఈ నేపథ్యంలో ఈ నెల మొదట్లో సినిమా కోసం రెండు టీమ్‌లు పని చేస్తున్నాయని, ఒక టీమ్‌ ఇక్కడ.. ఇంకో టీమ్‌ అడవుల్లో సింహంతో ఫైట్‌ సీన్స్‌ తీస్తారని వార్తలొచ్చాయి. అనుకున్నట్లుగా బన్నీ లేకుండా సుకుమార్‌ ఆ మధ్య షూట్‌ చేశారు. ఆయన మాత్రమే కనిపించినట్లు షూట్‌ మొదలైన ఫొటోలు రిలీజ్‌ చేసి విషయం చెప్పారు. కానీ ఏం తీశారో చెప్పలేదు.

ఇప్పుడు సినిమాటోగ్రాఫర్‌ మిరోస్లా కూబా బ్రొజెక్‌ ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. అందులో అల్లు అర్జున్‌ మీద ఫ్రేమ్‌ సెట్‌ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. అయితే ఆ లుక్‌ పుష్పరాజ్‌ లుక్‌లా లేదు. కాస్త కొత్తగా కనిపిస్తున్నాడు అల్లు అర్జున్‌. అయితే లుక్‌ మాత్రం అదిరిపోయింది. ఈ ఫొటో షేర్‌ చేస్తూ ‘‘సాహసం ప్రారంభమైంది. ఐకాన్‌ స్టార్‌ అల్లుఅర్జున్‌కు ధన్యవాదాలు..’’అని రాశారు కూబా. దీంతో ఇప్పుడు షూటింగ్‌ మొదలైందా అంటూ ప్రశ్నలు వస్తున్నాయి.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus