Pushpa: ‘తగ్గేదే లె’ అన్నారు..మొత్తానికి విలన్ వల్ల తగ్గారు..!

కరోనా సెకండ్ వేవ్ ఓ పక్క విలయతాండవం చేస్తున్నప్పటికీ.. ‘తగ్గేదే లె’ అన్నట్టు ‘పుష్ప’ చిత్ర యూనిట్ సభ్యులు షూటింగ్ జరుపుతూ వచ్చారు. ఈ విషయం పై చాలా మంది విమర్శలు గుప్పించినప్పటికీ వాళ్ళు వెనకడుగు వేయలేదు. అల్లు అర్జున్ కు కరోనా వచ్చినా ఈ చిత్రం షూటింగ్ సీక్రెట్ గా లాగించేసారు అనే టాక్ కూడా ఉంది. అయితే మొత్తానికి ‘పుష్ప’ టీం వెనక్కి తగ్గింది. అది కూడా ఈ చిత్రం విలన్ కారణంగా అని తెలుస్తుంది.

వివరాల్లోకి వెళితే.. మలయాళం స్టార్ హీరో ఫహద్‌ ఫాజిల్‌ ‘పుష్ప’ లో విలన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.ఇటీవల ఆయనతో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు. అయితే రోజు రోజుకీ కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతుండడంతో ఫాజిల్.. ‘ఇలాంటి పరిస్థితుల్లో షూటింగ్ చెయ్యలేను’ అని చెప్పి కొచ్చి వెళ్లిపోయాడట. దీంతో దర్శకుడు సుకుమార్ షూటింగ్ ఆపేసినట్టు స్పష్టమవుతుంది. ఇక ఫాజిల్ ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ‘పుష్ప’ మూవీ గురించి ఈ విధంగా చెప్పుకొచ్చాడు.

‘టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్‌ ‘పుష్ప’ కథ చెప్పినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. ఇలాంటి హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీలవుతున్నాను. ప్రతీ సినిమాలో కనిపిస్తున్నట్టు ‘పుష్ప’ లో విలన్ పాత్ర ఉండదు. ఇందులో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ఇప్పటి వరకు నా కెరీర్లో ఇలాంటి పాత్ర చెయ్యలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus