Pushpa: ఇంటర్నేషనల్‌ స్టార్స్‌ని రంగంలోకి దింపుతున్నారా?

  • September 24, 2022 / 06:05 PM IST

‘పుష్ప : ది రైజ్‌’ ఎంతటి ఘన విజయం అందుకుందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అందరి చూపు ‘పుష్ప: ది రూల్‌’ మీద పడింది. తొలి సినిమాకు మించిన విజయం ఈ సినిమా అందుకోవాలని ఎదురు చూస్తున్నారు అభిమానులు. దీని కోసం చిత్రబృందం వెంటనే షూటింగ్‌ ప్రారంభించకుండా.. స్క్రిప్ట్‌, కాస్ట్‌ అండ్‌ క్రూని ఫిక్స్‌ చేసుకున్నారట. ఈ క్రమంలో ఈ సినిమాలో హాలీవుడ్‌ నటుల్ని కూడా తీసుకుంటున్నారని వార్తలొస్తున్నాయి. మరోవైపు తొలి ‘పుష్ప’ విదేశాలకు వెళ్తోంది అని కూడా వినిపిస్తోంది.

అల్లు అర్జున్ – సుకుమార్ – రష్మిక మందన కాంబినేషన్‌లో రూపొందిన ‘పుష్ప : ది రైజ్‌’ గతేడాది డిసెంబర్‌ 17న విడుదలైన విషయం తెలిసిందే. సౌత్ టు నార్త్ మొత్తం దేశమంతటా థియేటర్లలో రచ్చ చేసిందీ చిత్రం. అదే సమయంలో భారీగా వసూళ్లను కూడా అందుకుంది. దీన్ని ఇప్పుడు విదేశాలకు తీసుకెళ్లాలని ప్రయత్నాలు సాగుతున్నాయట. తొలుతగా ఈ సినిమాను రష్యాలో విడుదల చేయాలని చూస్తున్నారట. ఇటీవల ఈ సినిమాను మాస్కో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ లో స్క్రీనింగ్ చేశారు.

ఇంగ్లిషు, రష్యన్‌ సబ్‌ టైటిల్స్‌తో అక్కడ సినిమాను వేయగా.. మంచి స్పందన వచ్చిందట. దీంతో త్వరలో ఈ సినిమా రష్యన్‌ డబ్బింగ్‌ వెర్షన్‌ను విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారని టాక్‌. మరి అక్కడ కూడా పుష్ప ‘తగ్గేదేలే’ అని ఏం రేంజిలో దూసుకుపోతాడో చూడాలి. ‘పుష్ప’ సీక్వెల్‌ ‘పుష్ప: ది రూల్‌’ షూటింగ్ లాంఛనంగా ఇటీవల మొదలైంది. త్వరలోనే పూర్తి స్థాయి షెడ్యూల్‌ మొదలుపెడతారు. ఈ క్రమంలో హాలీవుడ్‌ నటుల్ని తీసుకొస్తారని టాక్‌. దీని గురించి దర్శకుడు సుకుమార్‌ అంతర్జాతీయ నటుల ఏజెన్సీతో టచ్‌లో ఉన్నారని అంటున్నారు.

ఒకవేళ ఈ సినిమా అనుకున్నట్లు రష్యాలో డబ్బింగ్‌ వెర్షన్‌గా విడుదలైతే.. అల్లు అర్జున్‌ తనదైన శైలిలో не будет кланяться అని అంటాడు. ఇదేం భాష అనుకుంటున్నారా? రష్యన్‌. ఇదెలా పలుకుతారు అని అనుకుంటున్నారా? ‘నీ బుదెత్‌ క్లానియత్‌సా’. అంటే ‘తగ్గేదేలే’ అని అర్థం.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus