Pushpa2: రెండో ‘పుష్ప’ కోసం సుకుమార్‌ టీమ్‌ విమానంలో..!

  • November 11, 2022 / 03:53 PM IST

సినిమా రిలీజ్‌ డేట్ల కోసం జనాలు ఎదురు చూసే రోజులు ఎప్పటి నుండో ఉన్నాయి. అయితే సినిమా స్టార్టింగ్‌ కోసం జనాలు ఎదురుచూసే పరిస్థితులు గతంలో ఉన్న దాఖలాలు లేవు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది. అందులో పవన్‌ కల్యాణ్‌, మహేష్‌బాబు, తారక్‌, అల్లు అర్జున్‌ తదితర హీరోల సినిమాలకు ఈ పరిస్థితి ఏర్పడింది. మిగిలిన వారి సంగతి పక్కనపెడితే… అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌కి అయితే గుడ్‌ న్యూస్‌. ‘పుష్ప 2’ షూటింగ్‌ ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయట.

‘పుష్ప: ది రూల్‌’ సినిమా అంటే ‘పుష్ప 2’ షూటింగ్‌ను ప్రారంభించడానికి టీమ్‌ సిద్ధమైందట. దీని కోసం కోర్‌ టీమ్‌ దుబాయి వెళ్లబోతోందని సమాచారం. ఈనెల 13న ‘పుష్ప 2’ షూటింగ్ బ్యాంకాక్‌లో ప్రారంభం కాబోతోందని సమాచారం. అక్కడి అడవుల్లో దాదాపు 30 శాతం సినిమా షూటింగ్ ఉంటుందని సమాచారం. పులితో అల్లు అర్జున్ తలపడే ఒక భారీ యాక్షన్ సీన్‌ ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని ఇప్పటికే వార్తలొచ్చాయి. ఆ సీన్‌ ఈ షెడ్యూల్‌లోనే తీస్తారని సమాచారం.

బ్యాంక్‌లో త్వరలో మొదలయ్యే షెడ్యూల్‌ కోసం విదేశీ ఫైట్ మాస్టర్లు పనిచేస్తారని చెబుతున్నారు. ఈ షెడ్యూల్‌ కోసం అల్లు అర్జున్‌తోపాటు, ఫహాద్ ఫాజిల్, రష్మిక మందన, సునీల్ తదితర కీలక నటులు బ్యాంకాక్‌ బయలుదేరుతున్నారట. ఇవాళ, రేపు ఈ విషయంలో అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు. అక్కడ షూట్‌కి సంబంధించి ఇటీవల అల్లు స్టూడియోస్‌లో మాక్‌ షూట్‌ కూడా చేశారని అంటున్నారు.

ఇక ఈ సినిమా విడుదల విషయంలోనూ ఓ పుకారు వినిపిస్తోంది. ‘పుష్ప 1’ విడుదలైన డిసెంబరు నెలనే రెండో ‘పుష్ప’ విడుదల కోసం ఎంచుకున్నారని అంటున్నారు. అంటే 2023 డిసెంబరులో ‘పుష్ప’ థియేటర్లలో ‘రూల్‌’ చేస్తాడన్నమాట. తొలి సినిమాకు పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు, భారీ వసూళ్లు రావడంతో రెండో పార్టు విషయంఓ అసలు తగ్గొద్దు అని నిర్మాతలు అనుకుంటున్నారట. ఇక హీరో బన్నీ, డైరక్టర్‌ సుకుమార్‌ కూడా అదే మాట అంటారులెండి.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus