Pushpa: పుష్ప ది రైజ్ అక్కడ కూడా సక్సెస్ సాధిస్తుందా?

2021 సంవత్సరంలోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో పుష్ప ది రైజ్ ఒకటనే సంగతి తెలిసిందే. సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కమర్షియల్ గా ఈ సినిమా సక్సెస్ సాధించడంతో పాటు ఎన్నో అవార్డులను గెలుచుకుంది. బన్నీ ఈ సినిమాలోని పాత్ర కోసం ఎంతో కష్టపడగా పుష్ప ది రైజ్ సక్సెస్ తో బన్నీకి ఆయన కోరుకున్న సక్సెస్ అయితే దక్కింది. అయితే పుష్ప ది రైజ్ సినిమా త్వరలో రష్యాలో రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది.

రష్యా దేశంలోకి అక్కడి భాషలో డబ్ చేసి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. పుష్ప ది రైజ్ అక్కడ కూడా సంచలన విజయాన్ని సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు పుష్ప ది రూల్ రెగ్యులర్ షూటింగ్ త్వరలో మొదలుకానుండగా వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. సుకుమార్ ఇప్పటికే పుష్ప ది రూల్ సినిమాకు సంబంధించి లొకేషన్లను ఫైనల్ చేశారని 350 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని బోగట్టా.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఖర్చు విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించడానికి సిద్ధమవుతున్నారు. పుష్ప ది రూల్ ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కనుండగా త్వరలో ఆ వివరాలు తెలిసే ఛాన్స్ ఉంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమా కోసం అద్భుతమైన ట్యూన్స్ ను సిద్ధం చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

సినిమాసినిమాకు దర్శకునిగా సుకుమార్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది. సుకుమార్ ఈ సినిమా స్క్రిప్ట్ కోసమే ఏకంగా ఎనిమిది నెలల సమయం కేటాయించారు. సుకుమార్ పుష్ప ది రూల్ తర్వాత రామ్ చరణ్ తో ఒక సినిమాను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus