Allu Arjun: పుష్ప2 మూవీని ఓన్ రిలీజ్ చేస్తున్న బన్నీ.. ప్లాన్ ఇదేనంటూ?

పుష్ప ది రైజ్ (Pushpa) మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించి కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సాధించిన సంగతి తెలిసిందే. పుష్ప ది రూల్ సినిమాకు బిజినెస్ పరంగా భారీ ఆఫర్లు వస్తుండగా ఓవర్సీస్ లో మాత్రం పుష్ప2 (Pushpa2) సినిమాను బన్నీ (Allu Arjun) ఓన్ రిలీజ్ చేస్తున్నారని సమాచారం అందుతోంది. బన్నీ ఓన్ రిలీజ్ చేస్తే ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది.

పుష్ప2 మూవీపై బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం భారీ స్థాయిలో అంచనాలు నెలకొనగా అక్కడ పుష్ప ది రైజ్ 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్న బన్నీ పుష్ప ది రూల్ సినిమాతో మరోమారు ఇండస్ట్రీని షేక్ చేస్తానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. సంవత్సరం సంవత్సరానికి బన్నీ క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.

అల్లు అర్జున్ పలు యాడ్స్ లో నటిస్తూ యాడ్స్ ద్వారా కూడా అభిమానులకు అంతకంతకూ దగ్గరవుతున్నారు. పుష్ప ది రూల్ సినిమాతో బన్నీ డిస్ట్రిబ్యూటర్ గా కూడా సక్సెస్ అవుతారేమో చూడాల్సి ఉంది. మరోవైపు పుష్ప ది రూల్ వైజాగ్ షెడ్యూల్ తాజాగా పూర్తైందని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు భారీ రేంజ్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారని సమాచారం అందుతోంది.

పుష్ప ది రూల్ సినిమాలో మరి కొందరు కొత్త నటులు కూడా నటిస్తారని భోగట్టా. దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తుండగా పుష్ప ది రూల్ సినిమాలో ప్రతి సాంగ్ స్పెషల్ గా ఉండనుందని సమాచారం అందుతోంది. పుష్ప ది రూల్ సినిమా అనుకున్న తేదీకి విడుదలైతే మాత్రం ఈ సినిమా సృష్టించే సంచలనాలు మామూలుగా ఉండవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

రజాకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

లంబసింగి సినిమా రివ్యూ & రేటింగ్!
సేవ్ ది టైగర్స్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus