Pushpa2, Devara: పుష్ప2 మూవీలో ఆయన సీఎంగా కనిపిస్తారా.. ఏమైందంటే?

బన్నీ (Allu Arjun)  సుకుమార్(Sukumar)  కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప2 (Pushpa 2) సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి షాకింగ్ అప్ డేట్స్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుండగా ఆ అప్ డేట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. పుష్ప ది రైజ్ లో ఎంపీగా కనిపించిన రావు రమేష్ (Rao Ramesh) సీక్వెల్ లో ముఖ్యమంత్రిగా కనిపిస్తారని తెలుస్తోంది. ఆయనకు సంబంధించిన కీలక సన్నివేశాలను సుకుమార్ షూట్ చేసినట్లు సమాచారం అందుతోంది. యాగంటిలో రష్మిక (Rashmika Mandanna)  స్వామిని దర్శించుకునే సీన్ ను తాజాగా షూట్ చేశారని భోగట్టా.

దేవర (Devara) కోసం క్రియేట్ చేసిన అండర్ వాటర్ సెట్ లో పుష్ప2 యాక్షన్ సీక్వెన్స్ జరిగిందని ఈ యాక్షన్ సీక్వెన్స్ లో రక్తం ఏరులై పారుతుందని ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు హైలెట్ గా నిలవనుందని తెలుస్తోంది. ఈ సీన్స్ తో పాటు గంగమ్మ జాతర సన్నివేశాలు సినిమాకు హైలెట్ గా నిలిచేలా ఉంటాయని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో అండర్ వాటర్ సెట్ లో షూట్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ వేరే లెవెల్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

పుష్ప ది రూల్ లో ప్రతి సీన్ స్పెషల్ గా, లావిష్ గా ఉండేలా సుకుమార్ ప్లాన్ చేశారని బన్నీ కోరుకున్న మరో పాన్ ఇండియా హిట్ ఈ సినిమాతో సొంతమవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమాతో బన్నీ ఖాతాలో హ్యాట్రిక్ చేరుతుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. వీలైనంత వేగంగా ఈ సినిమా షూట్ పూర్తయ్యేలా మేకర్స్ ప్లాన్ ఉందని తెలుస్తోంది.

పుష్ప ది రూల్ సినిమాకు సంబంధించి త్వరలో అధికారికంగా మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ త్వరలో రిలీజ్ కానుంది. బన్నీ పుట్టినరోజున ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చేలా అదిరిపోయే అప్ డేట్స్ రానున్నాయి. పుష్ప ది రూల్ కోసం బన్నీ ఎంతో కష్టపడుతున్నారని తెలుస్తోంది.

షరతులు వర్తిస్తాయి సినిమా రివ్యూ & రేటింగ్!

‘డెవిల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?
‘బబుల్ గమ్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus