Pushparaj: ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ కోసం వేరే లెవల్‌ ప్లానింగ్‌లో లెక్కల మాస్టారు!

పాన్‌ ఇండియా సినిమాల తొలి పార్ట్‌ కంటే రెండో పార్ట్‌కి క్రేజ్‌, బజ్‌, బిజినెస్‌, కలక్షన్లు ఎక్కువ అంటుంటారు. దీనికి ఉదాహరణగా ‘బాహబలి’, ‘కేజీయఫ్‌’ సినిమాల పేర్లు చెప్పొచ్చు. ఈ సినిమాల తొలి పార్టులు వసూలు చేసిన కలెక్షన్లు కంటే రెండో పార్టు సాధించిన నెంబర్లు చాలా పెద్దవి. అయితే రిస్క్‌ కూడా అంటే ఉంటుంది అనుకోండి. ఇప్పుడు ఈ చర్చ ఎందుకంటే ‘పుష్ప 2’ గురించి. తొలి పార్టు అందించిన విజయాన్ని దాటి రెండో పార్టు చేయాలని సుకుమార్‌ అండ్‌ కో. అనుకుంటున్నారట.

ఈ క్రమంలో సినిమా ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ను భారీగా ప్లాన్‌ చేశారట. దీని కోసం ఏకంగా (Pushparaj) ‘పుష్ప’రాజ్‌ను జపాన్‌ పంపిస్తున్నారట. ఎర్ర చందనం డీల్‌ మాట్లాడటానికి తొలి ‘పుష్ప’లో చెన్నై వెళ్తాడు ‘పుష్ప’రాజ్‌. ఇప్పుడు రెండో ‘పుష్ప’లో ఏకంగా జపాన్‌ వెళ్తాడట. అయితే అక్కడ కేవలం మాటలే కాదు… పోరాటాలే ఉంటాయట. మాట్లాడదాం అని వెళ్లిన పుష్పతో అక్కడి డీలర్‌ గొడవకు దిగడం, ఫైట్‌కి రావడం ఉంటాయట. ఆ ఫైట్‌ను అంతకుమించి అనే రేంజిలో సిద్ధం చేస్తున్నారట లెక్కల మాస్టారు.

దీనికి తగ్గట్టుగా ఆ సన్నివేశాలను జపాన్‌లోనే చిత్రీకరించాలని టీమ్‌ అనుకుంటోందట. ఈ మేరకు కొన్ని సన్నివేశాలు ఇక్కడ తీసి మెయిన్‌ సన్నివేశాలు అక్కడే పెట్టుకుంటారట. త్వరలోనే ఈ షూట్‌ ఉంటుంది అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా మీద మైత్రి మూవీ మేకర్స్ భారీ ఆశలు పెట్టుకుంది. రూ. వందల కోట్లు దీని కోసం ఖర్చు పెడుతోంది. దర్శకుడు కూడా ఆ దిశగా క్వాలిటీ అవుట్‌పుట్‌ ఇస్తున్నారట. ఏ మాత్రం మొహమాటాలకు పోకుండా ప్లాన్‌ చేసుకుంటున్నారట.

ఈ క్రమంలో సినిమా డీల్స్‌ విషయంలో మైత్రి టీమ్‌ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. అందుకే ఓటీటీ విషయంలో తొలి పార్టును కొనుక్కున్న అమెజాన్‌కు కాకుండా నెట్‌ఫ్లిక్స్‌కు ఇచ్చారు. ఇక ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్‌ చేస్తారు అని తొలుత చెప్పారు. కానీ ఇప్పుడు ఆ సినిమా డిసెంబరుకు వెళ్లొచ్చు అని అంటున్నారు.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus