Brahmanandam: బ్రహ్మానందంని తక్కువ చేస్తూ నిర్మాత పీవీపీ కామెంట్స్!

ప్రముఖ సినీ నిర్మాత అలాగే వైసీపీ నేత అయిన ప్రసాద్‌ వి.పొట్లూరి(పీవీపీ) అందరికీ సుపరిచితమే.రవితేజతో ‘బలుపు’, అనుష్కతో ‘సైజ్ జీరో’, అడివి శేష్ తో ‘క్షణం’ ‘ఎవరు’, నాగార్జున- కార్తీ.. లతో ‘ఊపిరి’ , మహేష్ బాబుతో ‘బ్రహ్మోత్సవం’ , రానాతో ‘ఘాజీ’, విశ్వక్ సేన్ తో ‘ఓరి దేవుడా’ వంటి క్రేజీ సినిమాలను నిర్మించారు. అలాగే మహేష్ బాబు ‘మహర్షి’, విజయ్ ‘వారసుడు’ ల చిత్రాలకి సహా నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఈయన డిస్ట్రిబ్యూటర్ గా కూడా అనేక హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించడం జరిగింది.

ఇంత మంచి ట్రాక్ రికార్డు ఉన్న ఈయన అప్పుడప్పుడు వివాదాలతో కూడా వార్తల్లో నిలుస్తుంటారు. మొన్నామధ్య ల్యాండ్ విషయంలో ఈయన పై కేసు నమోదైన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు మరోసారి కాంట్రోవర్సీలో చిక్కుకున్నారు. ఈ క్రమంలో బ్రహ్మానందం పై ఆయన చేసిన కామెంట్స్ చాలా చీప్ గా అనిపించాయని నెటిజన్లు డిస్కస్ చేసుకుంటున్నారు. తాజాగా జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఆయన జనసేన పార్టీకి వార్నింగ్ ఇస్తూ.. “వాపుకి బలుపుకి తేడా తెలుసుకోకపోతే, బాహుబలిని బ్రహ్మానందాన్ని.. జననేతను జోకర్ని చేస్తారు ఓటరు మహాశయులు..సర్వజనా సుఖినోభవంతు” అంటూ ఆయన ట్విట్టర్లో రాసుకొచ్చారు.ప్రత్యర్థి పార్టీకి సవాలు విసరడం, విమర్శించడం అనేది తన రాజకీయంలో ఒక భాగమే కావచ్చు. కానీ ‘బాహుబలిని.. బ్రహ్మానందాన్ని (Brahmanandam) చేస్తారు’ అనడంపై కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

‘కామెడీకి బ్రాండ్ అంబాసిడర్, గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించుకున్న గొప్ప కమెడియన్, వెయ్యికి పైగా చిత్రాల్లో నటించి ఎంతో కీర్తి ప్రతిష్టలు ఆర్జించిన స్టార్ కమెడియన్ అయినటువంటి బ్రహ్మానందం.. నీకు అంత తక్కువగా కనిపిస్తున్నారా.? ఆయన స్థాయిని తక్కువ చేసే అర్హత.. కనీసం ఆయన స్థాయిని ప్రశ్నించే అర్హత నీకు ఇంకా రాలేదు’ అంటూ నిర్మాత పీవీపీ పై కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. దీంతో ఈ టాపిక్ వైరల్ అవుతుంది.

https://twitter.com/PrasadVPotluri/status/1731501324888670627

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus