చాలా షరతులున్నాయి కానీ.. సినీ లవర్స్‌కి బంపర్‌ ఆఫర్‌!

సినిమా అంటే సామాన్యుడి వినోదం.. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు సినిమా సామాన్యుడికి అందుబాటులో ఉందా అంటే లేదనే చెప్పాలి. మల్టీప్లెక్స్‌లు అయితే మరీనూ. ఇలాంటి సమయంఓ ప్రముఖ మల్టీప్లెక్స్‌ చెయిన్‌ పీవీఆర్‌ సరికొత్త ఆఫర్‌తో మీ ముందుకు వచ్చింది. అదే పీవీఆర్‌ పాస్‌పోర్ట్‌. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఈ స్పెషల్‌ ప్రివేలేజ్‌ ప్రోగ్రామ్‌ను ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా తీసుకొచ్చింది. దీని ధర రూ. 1500 కాగా ఇతర వివరాలు ఇలా ఉన్నాయి.

పీవీఆర్‌లో సినిమా అంటే.. కేవలం సినిమా మాత్రమే కాదు. ఇంకా చాలా అనే విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు పీవీఆర్ ఇస్తున్న ఈ ప్రివిలేజ్‌ ప్రోగ్రామ్‌ కూడా అంతే. ముందుగా చెప్పినట్లు ఈ ప్యాక్‌ ధర రూ. 1500. వ్యాలిడిటీ 90 రోజులు. దీనిని ప్రతి వారంలో సోమవారం నుండి శుక్రవారం వరకు వాడుకోవచ్చు. అయితే ఆ 90 రోజుల్లో 30 సార్లు మాత్రమే సినిమా చూడొచ్చు. రోజులో ఒకసారి మించి ఈ ప్యాకేజీని వాడుకోలేరు. అంటే రూ. 1500కి మూడు నెలల్లో 30 సినిమాలు చూడొచ్చన్నమాట.

ఈ ప్యాక్‌ ఆన్‌లైన్‌కి మాత్రమే వర్తిస్తుంది. అంటే ఆన్‌లైన్‌లో మాత్రమే టికెట్లు కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. కౌంటర్‌లో కొనుగోలుకు వర్తించదు. ఈ ఆఫర్‌ హైదరాబాద్‌తోపాటు పుణె, కోల్‌కతా, లక్నో, అహ్మదాబాద్‌లో పని చేస్తుంది. అయితే టికెట్‌ ధర గరిష్ఠంగా రూ. 400 ఉండాలి. అంతకుమించి టికెట్‌ రేటు ఉంటే ఆ అదనపు అమౌంట్‌ వినియోగదారుడు భరించాలి. ఈ ప్యాకేజీ ఉన్న వారు రూ.800 ఖర్చు పెడితే.. రూ.200ల ఫుడ్ అండ్‌ బెవరేజీ వోచర్‌ ఇస్తారు.

మామూలు ప్రేక్షకులకు ఈ ఆఫర్‌ ఆసక్తికరంగా అనిపించకపోయినా.. రెగ్యులర్‌ సినీ గోయర్స్‌కి, ఫ్యాన్స్‌కి బాగా ఉపయోగం. వీక్‌డేస్‌లో ఏ నైట్‌ షో చూద్దాం అనుకునేవాళ్లు ఎంచకా మూడు నెలల్లో 30 సినిమాలు చూసేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఈ ఆఫర్‌ మీద ఓ లుక్‌ వేయండి.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus