మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘న్యాయం కావాలి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది రాధికా శరత్ కుమార్. ఆ తరువాత ఆమె ‘యమకింకరుడు’ ‘పట్నం వచ్చిన పతివ్రతలు’ ‘అభిలాష’ ‘దొంగ మొగుడు’ ‘స్వాతి ముత్యం’ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు. అద్భుతమైన నటి అని కూడా అనిపించుకున్నారు. అటు తరువాత ‘పల్నాటి పౌరుషం’ ‘సూర్యవంశం’ ‘ప్రేమ కథ’ ‘అభిషేకం’ ‘రాజా ది గ్రేట్’ వంటి చిత్రాల్లో కూడా అద్భుతమైన పాత్రలను పోషించారు.
అయితే ఈమె ఓ విషయంలో చాలా బాధ పడుతుంటారట. అది కూడా తన ’40 ఏళ్ళ సినీ కెరీర్ లో తీరని లోటు’ అంటున్నారు రాధికా శరత్ కుమార్. నటనకు స్కోప్ ఉన్న చిత్రాలు తెరకెక్కించడంలో కె.బాలచందర్ సిద్ధహస్తుడు. కమల్ హాసన్,రజినీ కాంత్, చిరంజీవి వంటి స్టార్ లకు లైఫ్ ఇచ్చింది ఈయనే.వారికి నటనలో మెళుకువలు నేర్పిన గురువు. అయితే ఈయన డైరెక్షన్లో సినిమా చేసే అవకాశం రాధిక గారికి దక్కలేదు. ఈయన డైరెక్షన్లో నటించాలని ఆమెకు చాలా ఆశగా ఉండేదట.
ఎన్నో సార్లు వీరిమధ్య కదా చర్చలు కూడా జరిగాయట. కానీ వీరి స్థాయికి తగినట్టు ఆ పాత్ర లేదనే ఉద్దేశంతో ఆగిపోయేవారట. ఎప్పటికైనా తన కల నెరవేరుతుంది అని ఆశగా ఎదురుచూసిన రాధిక కు ఆ విషయంలో నిరాశే మిగిలింది అని తెలుస్తుంది. ఇక తాజాగా.. జ్యోతిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘పొన్ మగళ్ వందాల్’ చిత్రం తనకు బాగా నచ్చిందని కూడా ఈమె తెలిపింది.
Most Recommended Video
రన్ మూవీ రివ్యూ & రేటింగ్
జ్యోతిక ‘పొన్‌మగల్ వందాల్’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!
ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!