Raai Laxmi, Ms Dhoni: అతడితో రిలేషన్ నా లైఫ్ లో ఒక మచ్చ: రాయ్ లక్ష్మీ

Ad not loaded.

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ గతంలో సౌత్ హీరోయిన్ రాయ్ లక్ష్మీతో లవ్ ట్రాక్ నడిపించారు. 2008లో ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ధోనీ ఉన్నప్పుడు ఆ జట్టు ప్రచారకర్తగా రాయ్ లక్ష్మీ వ్యవహరించింది. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి.. అది ప్రేమగా మారింది. అప్పట్లో ఈ ఇద్దరూ డేటింగ్ చేసినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే వీరిద్దరి రిలేషన్ ఎక్కువకాలం కంటిన్యూ అవ్వలేదు.

ఆ తరువాత ధోనీ.. సాక్షిని పెళ్లి చేసుకున్నారు. రాయ్ లక్ష్మీ మాత్రం ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో ధోనీతో బ్రేకప్ గురించి చెప్పుకొచ్చింది. ధోనీతో కొనసాగించిన రిలేషన్ తన జీవితంలో ఓ మచ్చగా మిగిలిపోయిందని తెలిపింది. తనతో బ్రేకప్ జరిగి పన్నెండేళ్లు గడిచినా.. ఈ విషయం ఇప్పటికీ తనను వెంటాడుతూనే ఉందని చెప్పారు. ధోనీ గురించి మీడియాలో ఏదైనా చర్చవస్తే .. తన పేరుని ప్రస్తావిస్తున్నారని బాధపడింది రాయ్ లక్ష్మీ.

తనకు పెళ్లై, పిల్లలు పుట్టినా.. ధోనీతో ఎఫైర్ గురించి మాట్లాడుతూనే ఉంటారేమోనని కామెంట్ చేసింది ఈ బ్యూటీ. తాము బ్రేకప్ చెప్పుకున్నప్పటికీ.. ఒకరిపై మరొకరికి గౌరవం ఉందని తెలిపింది. ధోనీ తరువాత తన లైఫ్ లో చాలా బ్రేకప్స్ అయ్యాయని, వాటి గురించి మాత్రం ఎవరూ పట్టించుకోలేదని చెప్పుకొచ్చింది.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus