సెన్సార్ ఉంటేనే భయపడలేదు.. ఇక ఆన్లైన్ అంటే రచ్చే

  • February 5, 2020 / 11:19 AM IST

ఒక హీరోయిన్ గా రాణించడానికి కావాల్సిన అన్నీ లక్షణాలు పుష్కలంగా ఉన్నప్పటికీ.. సరైన అవకాశాలు అందుకొనేలోపు ముదిరిపోవడంతో లక్ష్మీరాయ్ కి సపోర్టింగ్ రోల్స్ లేదా ఐటెమ్ సాంగ్స్ లో చిట్టిపొట్టి బట్టలతో, తడిసిన అందాలతో డ్యాన్సులు చేసే అవకాశాలొచ్చాయే కానీ హీరోయిన్ ఛాన్స్ లు మాత్రం మంచివి రాలేదనే చెప్పాలి. అలాంటి తరుణంలో ఏకంగా బాలీవుడ్ నుంచి అమ్మడికి కథానాయికగా అది కూడా టైటిల్ రోల్ ప్లే చేసే ఆఫర్ రావడంతో ఎన్నడూ లేని విధంగా తన అందచందాలను వెండితెరపై ఆరబోసింది. అయినప్పటికీ పెద్దగా లాభం లేకపోయింది. పోనీ బొద్దుగా ఉండడమే పాపం అయిపోయిందేమో అనుకుని.. జిమ్ లో గంటల కొద్దీ కష్టపడిపోయి సన్నబడింది కూడా. అయినా కూడా ఆఫర్ల జాడ కనిపించలేదు.

దాంతో.. రాయ్ లక్ష్మి ఇప్పుడు డిజిటల్ డెబ్యూ చేసింది. “పాయిజన్ 2” అనే కొత్త సిరీస్ లో నటించింది రాయ్ లక్ష్మి. జీ5 సంస్థ నిర్మిస్తున్న ఈ సిరీస్ ఫస్ట్ లుక్ ను నిన్న విడుదల చేశారు. ఎప్పట్లానే అందాలను ఆరబోస్తూ రాయ్ లక్ష్మి షవర్ కింద నిల్చుని ఇచ్చిన హాట్ ఫోజోలు ఆన్లైన్ లో హల్ చల్ చేయడం జరిగింది. అయితే.. సినిమాలకు సెన్సార్ ఉంటుంది కాబట్టి రాయ్ లక్ష్మి ఎంత ఆరబోసినా.. సెన్సార్ కట్ చేసేసేది.. ఇప్పుడు డిజిటల్ కి సెన్సార్ లేదు కాబట్టి రాయ్ లక్ష్మి రచ్చ చూడడానికి ఆమె ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు. మరి ఈ డిజిటల్ కెరీర్ ఆమెకు ఎంతవరకూ ప్లస్ అవుతుందో చూడాలి.

Most Recommended Video

అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
ఎన్టీఆర్ ఆస్తుల వివరాలు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus