Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ
- April 12, 2026 / 07:40 PM ISTByPhani Kumar
నిర్మాతగా చేసిన తొలి సినిమా ‘కమిటీ కుర్రోళ్ళు’తో భారీ విజయాన్ని అందుకుంది మెగా డాటర్ నిహారిక కొణిదెల. దీని తర్వాత హారర్ ఫాంటసీ జోనర్లో ‘రాకస'(Raakaasaa) చేసింది.
Raakaasaa Collections
సంగీత్ శోభన్, నయన్ సారిక హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమాతో మానస శర్మ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. గెటప్ శీను, వెన్నెలకిషోర్ కీలక పాత్రల్లో నటించారు. ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా.

కంటెంట్ పై ఉన్న కాన్ఫిడెన్స్ తో ప్రీమియర్స్ షోలు కూడా వేశారు. వాటికి పాజిటివ్ టాక్ వచ్చింది.దీంతో బాక్సాఫీస్ వద్ద బాగానే ఓపెనింగ్స్ తెచ్చుకుంటుంది. ఫస్ట్ వీకెండ్ ఈ సినిమాకి డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ ఐపీఎల్ మ్యాచ్..ల ఎఫెక్ట్ వల్ల వీక్ డేస్ లో ఈ సినిమా అనుకున్న రేంజ్లో పెర్ఫార్మ్ చేయలేదు. అలా అని వసూళ్లు తీసి పారేసే విధంగా కూడా లేవు. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే
| తెలంగాణ | 3.36 cr |
| సీడెడ్ | 0.74 cr |
| ఆంధ్ర(టోటల్) | 2.65 cr |
| ఏపీ + తెలంగాణ(టోటల్) | 6.75 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 2.71 cr |
| వరల్డ్ వైడ్ టోటల్ | 9.46 cr(షేర్) |
‘రాకాస’ సినిమాకి వరల్డ్ వైడ్ గా రూ.14.5 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.15 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.9.46 కోట్లు షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.16.30 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.5.54 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వారం పర్వాలేదు అనిపించింది.. కానీ టార్గెట్ రీచ్ అవ్వాలంటే రెండో వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకోవాల్సి ఉంది.
జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘బైకర్’.. కానీ
















