Raashi Khanna: నైట్ పార్టీ లో రాశీ ఖన్నా చెల్లి పుట్టినరోజు సెలబ్రేషన్స్.. వైరల్ అవుతున్న ఫోటోలు

‘ఊహలు గుసగుసలాడే’ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా.. ఆ తర్వాత ‘బెంగాల్ టైగర్’ ‘తొలిప్రేమ’ ‘ప్రతిరోజు పండగే’ వంటి సినిమాల్లో నటించి క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. దాదాపు టాలీవుడ్ మిడ్ రేంజ్ హీరోలందరితో కలిసి నటించిన ఈమె ఎందుకో స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది.ఎందుకంటే స్టార్ హీరోల సినిమాల్లో నటించే ఛాన్స్ కూడా ఈమెకి దక్కలేదు. ఒక్క ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ మాత్రమే ఈమె చేసిన పెద్ద సినిమా.

ఎన్టీఆర్ తప్ప మిగిలిన స్టార్ హీరోలు ఈమెను పట్టించుకోలేదు. ప్రస్తుతం ‘ఫర్జీ’ వంటి వెబ్ సిరీస్ లలో నటిస్తూ కాలం గడుపుతున్న ఈమె మరోపక్క పలు బ్రాండ్స్ ను కూడా ప్రమోట్ చేస్తూ వస్తోంది. `గ్లోబల్‌ స్పా` అనే మ్యాగ్జైన్ కోసం ఓ ఘాటైన అందాల ప్రదర్శన చేసి వార్తల్లో నిలిచింది ఈ బ్యూటీ. ఆ ఫోటోలు ఇంటర్నెట్ కి హీట్ ఎక్కించాయి అని చెప్పాలి.

ఇదిలా ఉండగా.. నిన్న నైట్ పార్టీలో రాశీ ఖన్నా చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఆమె చెల్లి పుట్టినరోజు కావడంతో ఆమె నైట్ పార్టీలో చిల్ అవుతున్న ఫొటోస్ ను తీసుకుని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. చెల్లెలి పుట్టిన రోజు సందర్భంగా ఫ్రెండ్స్ తో కలిసి బిగ్ పార్టీ చేసుకుంది రాశీ ఖన్నా. ఈ ఫొటోల్లో రాశీతో (Raashi Khanna)  పాటు అందాల భామలు తమ అందంతో కనువిందు చేశారు. ఆ ఫోటోలు మీరు కూడా చూడండి:

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus