మొత్తానికి ఆ భామ ఓకే అయ్యిందా!!!

  • January 31, 2017 / 06:07 AM IST

టాలీవుడ్ లో యంగ్ టైగర్ కాలిబెర్ గురించి….మాస్ ఫాలోయింగ్ గురించి మనం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది….అయితే అదే క్రమంలో ఎన్టీఆర్ సినిమా వస్తుంది అంటే యావత్ ప్రేక్షక లోకానికి పండగ వాతావరణమే అనే చెప్పాలి…ఇదిలా ఉంటే ఎన్టీఆర్ వరుస హిట్స్ కొట్టి హ్యాట్రిక్ సక్సెస్ తో మంచి ఊపుమీద ఉన్నాడు…అదే ఊపులో అన్న కల్యాణ్ రామ్ నిర్మాణంలో, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో ‘జైలవకుశ’ అనే సినిమా చేస్తున్నట్లు తెలిసిందే…అయితే ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నటించనున్నట్లు సమాచారం….అయితే ఆ మూడు పాత్రలకు తగ్గ హీరోయిన్స్ కోసం కల్యాణ్ రామ్ తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నాడు…ఇప్పటికే చాలా మంది పేర్లు వినిపించినప్పటికీ….రాశి ఖన్నా.. నివేదా థామస్ రెండు పాత్రలకు ఖరారైనట్లు వార్తలొచ్చాయి.

ఐతే చిత్ర నిర్మాత కళ్యాణ్ రామ్ మాత్రం ఒకే హీరోయిన్నే కన్ఫమ్ చేశాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో ఆ హీరోయిన్ రాశి ఖన్నానే అని ప్రకటించారు. కల్యాణ్ రామ్ ట్వీట్ సారాంశం ఏంటి అంటే….‘‘ఎన్టీఆర్  27వ సినిమాలో ఒకానొక హీరోయిన్ గా అందాల రాశి నటిస్తుంది. ఆమెకు స్వాగతం’’ అని ఎన్టీఆర్ ఆర్ట్స్ పేర్కొంది. ఇంతవరకూ బాగానే ఉంది కానీ….నివేదా ఈ సినిమాలో నటించేట్లయితే రాశితో పాటుగా ఆమె పేరు కూడా ఒకేసారి ప్రకటించాలి. అలా చేయలేదెందుకో అన్న కామెంట్స్ ఇండస్ట్రీ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తున్నాయి….మొత్తానికి తొలి సారి కరియర్ లో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో అభిమానులను మెప్పించనున్నాడు…మరి ఈ ప్రయోగం ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus