బికినీలో రచ్చ చేస్తున్న రాశీ ఖన్నా

‘మనం’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది రాశీ ఖన్నా. అయితే హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది మాత్రం ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతోనే. ఆ చిత్రంలో ‘శ్రీ సాయి శిరీష ప్రభావతి’ గా ఆమె చేసిన నటన ఇప్పటికీ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. చూడ చక్కని రూపం ఆమె సొంతం. ఇండస్ట్రీకి వచ్చి 5 ఏళ్ళు పూర్తయినా సరే ఈమెకు ఎందుకో స్టార్ హీరోల పక్కన చేసే అవకాశాలు రావడం లేదు. అలా అని హిట్లు లేవా అంటే.. అది కూడా కారణం కాదు. ఒక్క ఎన్టీఆర్ తో చేసిన ‘జై లవ కుశ’ తప్ప మరే స్టార్ హీరో పక్కన ఈమెకు అవకాశం రాలేదు.

‘తొలిప్రేమ’ చిత్రంతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే తరువాత వచ్చిన ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రం డిజాస్టర్ అవ్వడంతో ఈమెకు మళ్ళీ అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం ‘వెంకీమామ’ అలాగే విజయ్ దేవరకొండ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉండగా.. సడెన్ గా ఈమె గ్లామర్ డోస్ పెంచాలని ఫిక్సయినట్టుంది. తాజాగా ‘బికినీ’ లో దర్శనమిచ్చి అందరినీ షాక్ కు గురిచేసింది. తాజాగా ‘హెల్త్ కేర్’ అనే మ్యాగ్ జైన్ కు ఇచ్చిన ఫోటోషూట్లో పాల్గొంది రాశీ ఖన్నా. ఈ ఫోటోషూట్ కోసం ‘బికినీ’ ధరించి రకరకాల ఫోజులిచ్చింది. ఆ ఫోజులకి ఆమె చూపించిన ‘యాటిట్యూడ్’ సూపర్ అనే చెప్పాలి. అయితే ఎప్పుడూ ఈ రేంజ్లో గ్లామర్ షో చేయలేదు రాశీ. సోషల్ మీడియాలో ఈ ఫోటో తెగ వైరలవుతుంది. ‘రాశీ ఏంటి ఇలా తయారయ్యావ్’ అంటూ కొంతమంది కామెంట్లు కూడా పెడుతున్నారు.

1

2


Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus