‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా.. స్టార్ హీరోయిన్ రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది కానీ స్టార్ హీరోయిన్ గా మాత్రం ఎదగలేకపోయింది. తన కెరీర్ మొత్తంలో ఎన్టీఆర్ తో తప్ప.. వేరే స్టార్ హీరోతో ఆమె కలిసి నటించింది లేదు. చెప్పుకోడానికి హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు ఉన్నాయి. అయినా అవకాశాలు ఎక్కువ రావడం లేదు. అందుకే వెబ్ సిరీస్ వంటి వాటిలో కూడా నటిస్తూ వస్తోంది.
ఇక హీరోయిన్ల గురించి ప్రేమ, పెళ్లి వంటి వార్తలు రావడం సహజమే. (Raashi Khanna) రాశీ ఖన్నా వీటి పై గతంలో ఎప్పుడూ స్పందించింది లేదు. కానీ తాజాగా ఆ విషయాల గురించి బయట పెట్టింది. రాశీ ఖన్నా మాట్లాడుతూ.. “ప్రస్తుతం నేను సింగిల్ గా ఏమీ లేను,నాకు ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ప్రస్తుతం అతనితో డేటింగ్ లో ఉన్నాను. గతంలో కూడా నేను ఓ వ్యక్తిని గాఢంగా ప్రేమించాను. కానీ కొన్ని కారణాల వల్ల అతనికి బ్రేకప్ చెప్పాల్సి వచ్చింది.
దీంతో నేను డిప్రెషన్ కి గురయ్యాను. అలా డిప్రెషన్ కి గురయ్యి బరువు పెరిగిపోయాను. అందుకే నాకు సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఒకానొక టైంలో నేను సినిమాల్లో నుండి తప్పుకోవాలి అనుకున్నాను. కానీ నాలో కొత్త ఆశలు చిగురించాయి. మళ్ళీ ప్రేమలో పడటం తో నేను సంతోషంగా ఉన్నాను. అందుకే ఫిజిక్ పై కాన్సెంట్రేట్ చేసి సన్నబడ్డాను.ఇప్పుడు సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా గడుపుతున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.
ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!
‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?