Raashi Khanna: రెమ్యునరేషన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన రాశి ఖన్నా!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన రాశి ఖన్నాకు ఈ మధ్య కాలంలో వరుస షాకులు తగులుతున్నాయి. గత నెలలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించిన పక్కా కమర్షియల్, థాంక్యూ సినిమాలు మూడు వారాల గ్యాప్ లో విడుదల కాగా ఈ సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి ఫ్లాప్ రిజల్ట్ ను అందుకోవడం గమనార్హం. అయితే తాజాగా రాశి ఖన్నా రెమ్యునరేషన్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నేను కూడా రెమ్యునరేషన్ పెంచేశానా అని అందరూ అడుగుతుంటారని రాశి ఖన్నా చెప్పుకొచ్చారు. అయినా రెమ్యునరేషన్ తో పనేంటి అని ఆమె కామెంట్లు చేశారు. ఎవరికి ఎంత ఇవ్వాలి? ఎవరి దగ్గరినుంచి ఎంత తీసుకోవాలి? అనేది నటికి, నిర్మాతకు మధ్య జరిగే వ్యవహారమని రాశి ఖన్నా తెలిపారు. కొన్ని సినిమాలకు మేము రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తామని రాశి ఖన్నా అన్నారు. మరికొన్ని సినిమాలకు నిర్మాత ఎంత ఇస్తే అంతకు చేస్తామని ఆమె కామెంట్లు చేశారు.

కొన్ని సందర్భాలలో సినిమాలలోని పాత్రలు మనల్ని ప్రేరేపిస్తుంటాయని రాశి ఖన్నా చెప్పుకొచ్చారు. అలాంటి పాత్రలు మనలో స్పూర్తి నింపుతుంటాయని రాశి ఖన్నా కామెంట్లు చేశారు. అలాంటి కథలు వచ్చిన సమయంలో నేనే కాదు ఎవరూ పారితోషికం గురించి పట్టించుకోరని రాశి ఖన్నా వెల్లడించారు. ఒక సినిమాకు ఉచితంగా పని చేయొచ్చని ఆ సినిమా వల్లే నాలుగు సినిమాలలో ఆఫర్లు రావచ్చని రాశి ఖన్నా అన్నారు.

అలాంటి సమయంలో తీసుకున్నది ఎంత అనే విషయం ఎప్పటికీ లెక్క కాదని రాశి ఖన్నా కామెంట్లు చేశారు. రెమ్యునరేషన్ గురించి రాశి ఖన్నా చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుగులో గతంతో పోల్చి చూస్తే రాశి ఖన్నాకు ఆఫర్లు తగ్గాయి. స్టార్ హీరోల సినిమాలలో రాశి ఖన్నాకు ఆఫర్లు అస్సలు రావడం లేదు. కెరీర్ విషయంలో రాశి ఖన్నా ఆచితూచి అడుగులు వేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus