Raashi Khanna: ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా రాశిఖన్నా!

ఈ మధ్యకాలంలో చాలా మంది నటీనటులు ఓటీటీ ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతున్నారు. హీరోయిన్ రాశిఖన్నా కూడా తాజాగా ఓ వెబ్ సిరీస్ లో నటించడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో ‘థాంక్యూ’, ‘పక్కా కమర్షియల్’ వంటి సినిమాల్లో నటిస్తోంది. అవి కాకుండా ఐదారు తమిళ సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి.

వీటితో పాటు బాలీవుడ్ లో షాహిద్ కపూర్ సరసన ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ తెరకెక్కించిన రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ ను తెరకెక్కిస్తుండడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు రాశి మరో వెబ్ సిరీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సురేష్ వంగ అనే కొత్త దర్శకుడు రూపొందించనున్న ఈ సిరీస్ లో రాశిఖన్నా ప్రధాన పాత్ర పోషిస్తోంది. క్రైమ్, యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ కథ రాశి చుట్టూనే తిరుగుతుందట.

కథ ప్రకారం ఆమె ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతుంది. సిరీస్ మొత్తం సీరియస్ గా కనిపించే రోల్ ఇది. ఇందులో ప్రముఖ తమిళ నటుడు రవీంద్ర విజయ్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. రీసెంట్ గా విడుదలైన ‘ది ఫ్యామిలీ మ్యాన్2’లో ఆయన కీలకపాత్రలో కనిపించారు. ఈ సిరీస్ ను ఓటీటీ సంస్థ సోనీలో విడుదల చేయబోతున్నారట. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సిరీస్ ను రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus