Prabhas: ప్రభాస్‌ ఫ్యాన్స్‌కి మరోసారి నిరాశ పక్కా అంటున్నారు!

ప్రభాస్‌ ఫ్యాన్స్‌కి మరోసారి నిరాశ ఎదురుకానుందా? ఏంటీ ఇలాంటి ప్రశ్న వేశారు అనుకుంటున్నారా? పరిస్థితి చూస్తుంటే ఇలానే ఉంది. చాలామంది అనుమానిస్తున్నట్లుగానే సినిమా వాయిదా పడుతుంది అని సమాచారం. అవును… ‘రాధే శ్యామ్‌’ను వాయిదా వేస్తున్నారట. ప్రస్తుతం పుకారుగా మాత్రమే ఉన్న వార్త ఏ క్షణంలో అయినా నిజమవ్వొచ్చు అని టాక్‌. మరి సినిమా బృందం ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి. అసలు ఈ వార్త బయటకు రావడానికి కారణం సంక్రాంతి సినిమాలే.

అవును ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వాయిదా అని ప్రకటించిన తర్వాత టాలీవుడ్‌లో చిన్న సినిమాలు వరుస కట్టాయి. ఆ విషయం మీకూ తెలిసే ఉంటుంది. ఒకటి కాదు, రెండు కాదు సుమారు 10 సినిమాలు సంక్రాంతి బరిలోకి దిగుతున్నాయి. జనవరి 7న ఆది ‘అతిథి దేవోభవ’, వేయి శుభములు కలుగుగాక’, రానా ‘1945’ వస్తాయి. ఇవి కాకుండా సంక్రాంతి డేట్స్‌కి కళ్యాణ్‌దేవ్‌ ‘సూపర్‌ మచ్చి’, సిద్ధు ‘డీజే టిల్లు’, అశోక్‌ గల్లా ‘హీరో’, ఆశిష్‌ ‘రౌడీ బాయ్స్‌’, ఎం.ఎస్‌.రాజు ‘7 డేస్‌ 6 నైట్స్‌’ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. దీంతోపాటు రాజశేఖర్‌ ‘శేఖర్‌’ సినిమా కూడా అప్పుడే రిలీజ్‌ చేస్తారని టాక్‌.

ఇన్ని సినిమాలు సంక్రాంతికి వస్తున్నాయి అంటే… ‘రాధేశ్యామ్‌’ ఉండదు అనే సమాచారంతోనే కదా అనేది డౌట్‌. ‘రాధేశ్యామ్‌’ లాంటి పాన్‌ ఇండియా సినిమా వస్తున్నప్పుడు ఇలాంటి చిన్న సినిమాలు వస్తే ఆ సినిమా అన్నీ కొట్టుకుంటూ వెళ్లిపోతుంది. కాబట్టి ఇన్ని చిన్న సినిమాలు ధైర్యం చేసి వస్తున్నాయి అంటే… వాళ్లకు ‘రాధేశ్యామ్‌’ రాదు అనే నమ్మకం అయినా ఉండాలి, లేదంటే సమాచారం అయినా ఉండాలి. ఈ లెక్కలన్నీ వేసే ‘రాధేశ్యామ్‌’ వాయిదా పక్కా అంటున్నారు.

కరోనా ఆంక్షలు, థియేటర్లలో 50 శాతం నిబంధన, ఏపీలో టికెట్‌ రేట్లు లాంటి లెక్కలు వేసే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఆగిపోయింది. మరి ‘రాధేశ్యామ్‌’కి కూడా అవే సమస్యలు ఉంటాయి. కాబట్టి వాళ్లు ప్రస్తుతం లెక్కలేస్తున్నారని టాక్‌. ఒకవేళ ఇప్పుడు కానీ ‘రాధే శ్యామ్‌’ ఆగితే ఓటీటీకి వెళ్లిపోవడమే అనే టాక్‌ కూడా వినిపిస్తోంది. ప్రముఖ ఓటీటీలు దీని కోసం భారీ ఆఫర్లు ఇస్తున్నారని సమాచారం. మరి దేనికి ఓకే చేస్తారో చూడాలి.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus