పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుండీ దాదాపు రెండున్నరేళ్ళ తర్వాత రాబోతున్న చిత్రం ‘రాధే శ్యామ్’. రాధా కృష్ణకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ‘గోపికృష్ణా మూవీస్’ సంస్థతో కలిసి ‘యూవీ క్రియేషన్స్’ సంస్థ నిర్మించింది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో కృష్ణంరాజు, భాగ్య శ్రీ, జగపతి బాబు, మురళీ శర్మ తదితరులు నటిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించగా తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.
2022 లో ‘భీమ్లా నాయక్’ తర్వాత రాబోతున్న చిత్రం కావడంతో దీని పై భారీ అంచనాలే నెలకొన్నాయి. దాంతో బిజినెస్ కూడా భారీగానే జరిగింది.
వాటి వివరాలను ఓసారి గమనిస్తే :
నైజాం | 37.00 cr |
సీడెడ్ | 17.50 cr |
ఉత్తరాంధ్ర | 13.10 cr |
ఈస్ట్ | 8.60 cr |
వెస్ట్ | 8.00 cr |
గుంటూరు | 9.60 cr |
కృష్ణా | 8.00 cr |
నెల్లూరు | 4.20 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 105.50 cr |
తమిళ్ నాడు | 6.00 cr |
కేరళ | 1.80 cr |
కర్ణాటక | 13.00 cr |
నార్త్ ఇండియా (హిందీ) | 46.00 cr |
ఓవర్సీస్ | 24.00 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 196.30 cr |
‘రాధే శ్యామ్’ చిత్రానికి రూ.196.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.బ్రేక్ ఈవెన్ కు రూ.200 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఇది చిన్న టార్గెట్ అయితే కాదు. పాండమిక్ తర్వాత ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టిన సినిమా అయితే ఇప్పటి వరకు రాలేదు. మరి ‘రాధే శ్యామ్’ ఆశించిన స్థాయిలో వసూళ్ళని రాబడుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఆంధ్రలో టికెట్ రేట్లను పెంచారు కాబట్టి కొంత వరకు అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు.
Most Recommended Video
ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!