‘బాహుబలి’ వల్ల తెలుగు సినిమా స్థాయి పెరగడం పక్కనపెడితే… ప్రభాస్ సినిమాల బడ్జెట్ పెరిగిపోయింది. ‘సాహో’తో ఈ విషయం అందరికీ అర్థమైంది. సినిమా స్పాన్ పెంచి పాన్ ఇండియాగా మూవీగా తీర్చిదిద్దే క్రమంలో బడ్జెట్‌ను అమాంతం పెంచేశారు. ఇప్పుడు ‘రాధే శ్యామ్’ విషయంలోనూ అదే జరుగుతోందా? చిత్రబృందం నుంచి వస్తున్న లీకులు, టాలీవుడ్ వర్గాల లెక్కల ప్రకారం చూస్తే అదే నిజమయ్యేలా కనిపిస్తోంది. ఎందుకంటే సినిమా కోసం ఇప్పటికే యూవీ క్రియేషన్స్ ₹250 కోట్ల వరకు ఖర్చు పెట్టేసిందట. సినిమా ఇంకా పూర్తవ్వకపోవడంతో ఈ నెంబరు ఇంకా పెరిగేలా కనిపిస్తోంది. ప్రచారం ఖర్చు ఎలాగూ అధికం.
‘రాధే శ్యామ్’ చిత్రీకరణ ప్రస్తుతం చివరి దశకు వచ్చేసింది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుగుతోంది. దీని కోసం ప్రత్యేకంగా నాలుగు సెట్లు కూడా వేశారట. ఒక్కో సెట్‌కు భారీగా ఖర్చు అయినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా కూడా వాడని అత్యాధునిక కెమెరా, లెన్స్‌లను ఉపయోగిస్తున్నారట. సినిమా క్లైమాక్స్ విభిన్నంగా తెరకెక్కిస్తుండటమే దీనికి కారణం అని చెబుతున్నారు. ‘రాధే శ్యామ్’ పీరియాడికల్ వింటేజ్ సినిమాగా రూపొందుతున్న సినిమా కాబట్టి భారీ బడ్జెట్ పెట్టడం కరెక్టే అనిపిస్తోంది. అయితే అంత బడ్జెట్ వర్కౌట్ అవుతుందా అనేదే ఇప్పుడు ప్రశ్న.
‘బాహుబలి’ రోజుల్లో ₹250 కోట్ల బడ్జెట్ ఒకప్పుడు పెద్ద విషయం కాదు. కానీ ‘సాహో’ లాంటి నిరాశ మిగిల్చిన సినిమా తర్వాత ఇంత బడ్జెట్ సినిమా అంటేనే ఆలోచించాలి. కథ, కథనం, స్టార్‌కాస్ట్ పాన్ ఇండియా స్థాయిలో ఉండొచ్చు. కానీ పరిస్థితులు కూడా అలానే ఉండాలి కదా. కొవిడ్ – లాక్‌డౌన్ తర్వాత థియేటర్లలో ఫుల్ హాజరు కుదరని పరిస్థితి. టికెట్ రేటు పెంచితే వచ్చే ప్రేక్షకులు కూడా తగ్గే అవకాశమూ ఉంది. ఈ లెక్కన అంత బడ్జెట్ వర్కౌట్ అవుతుందా అనేది చూడాలి. అయితే ఇప్పటివరకు వచ్చిన పోస్టర్లు, టీజర్లు చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ కనిపిండం గమనార్హం.
Most Recommended Video
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!