పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘రాధే శ్యామ్’ చిత్రం కోసం దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు,ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జనవరి 14న సంక్రాంతి కానుకగా ‘రాధే శ్యామ్’ విడుదలవుతుంది అని దర్శకనిర్మాతలు ధీమాగా ప్రకటించారు. ‘పోస్ట్ పోన్ అయ్యింది’ అంటూ వార్తలు వస్తున్నప్పటికీ.. వాళ్ళు ఖండిస్తూనే వస్తున్నారు. కానీ జనాలకి మాత్రం ఈ చిత్రం సంక్రాంతికి వస్తుందన్న నమ్మకం లేదు. ఎందుకంటే ‘రాధే శ్యామ్’ అనేది పాన్ ఇండియా సినిమా.
తెలుగు రాష్ట్రాల్లో అయితే..ముఖ్యంగా ఆంధ్రలో అయితే టికెట్ రేట్ల ఇష్యు నడుస్తుంది. నార్త్ లో కరోనా ఆంక్షలు ఉన్నాయి. ఢిల్లీలో థియేటర్లను మూసేసారు. చాలా చోట్ల 50శాతం అక్యుపెన్సీ పెట్టారు. రేపో మాపో తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా ఆంక్షలు పెట్టె అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ‘రాధే శ్యామ్’ సినిమాని రిలీజ్ చేస్తే కలెక్షన్ల పై ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఇవన్నీ పక్కన పెట్టేస్తే.. దుబాయ్‌లో ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయినట్టు…
ప్రముఖ సినీ విశ్లేషకుడు ఉమైర్ సంధు తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. తాను ‘రాధే శ్యామ్’ చిత్రాన్ని వీక్షిస్తున్నట్టు కూడా ఆయన తెలియజేసాడు. ఇక సినిమా చూసిన తర్వాత అతను.. ‘ ‘రాధే శ్యామ్’ చిత్రం …దాని ట్రైలర్ కంటే భీభత్సంగా ఉంది’ అంటూ ట్వీట్ చేసాడు.సినిమా చూసాక అతను ఈ ఒక్క ట్వీట్ మాత్రమే వేసాడు. ‘రాధే శ్యామ్’ ట్రైలర్ అయితే చాలా బాగుంది అని ప్రేక్షకులే ఒప్పుకున్నారు.
విజువల్స్ కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కానీ సూపర్ అనే కామెంట్స్ కూడా వినిపించాయి. మరి ‘ట్రైలర్ కంటే సినిమా ఇంకా చాలా బాగుంది’ అని ఉమైర్ సంధు చెప్పడంతో ఫ్యాన్స్ మామూలుగా ఉంటారా? తెగ సంబరపడిపోతున్నారు. అయితే ఉమైర్ సంధు రివ్యూ పై జనాలకి పెద్దగా నమ్మకం ఉండదు. ‘బ్రహ్మోత్సవం’ ‘స్పైడర్’ ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ ‘అజ్ఞాతవాసి’ వంటి చిత్రాలకి కూడా అతను సూపర్ హిట్ అంటూ రివ్యూ ఇచ్చాడు. అవి ఎలాంటి ఫలితాల్ని చవి చూశాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
Watching #RadheShyam at Censor Board ! 👍
— Umair Sandhu (@UmairSandu) January 3, 2022
#RadheShyam is Far Far better than trailer. 🙏
— Umair Sandhu (@UmairSandu) January 3, 2022
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!