ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది. కొంతమంది ప్రేక్షకులు ఈ సినిమా విజువల్ గా కళ్లు చెదిరే స్థాయిలో ఉందని చెబుతుంటే మరి కొందరు మాత్రం నెగిటివ్ గా స్పందిస్తున్నారు. అయితే టాక్ తో సంబంధం లేకుండా మూడు రోజుల్లో రాధేశ్యామ్ సినిమా 37 శాతం కలెక్షన్లను రికవరీ చేసింది. ఈరోజు కూడా ఈ సినిమా స్టడీగానే ఉందని తెలుస్తోంది. భీమ్లా నాయక్ మినహా హిట్ టాక్ వచ్చిన సినిమా ఏదీ థియేటర్లలో లేకపోవడంతో రాధేశ్యామ్ సినిమా మాత్రమే ప్రేక్షకులకు బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తోంది.
మరో రెండు రోజుల్లో విద్యార్థులకు ఒంటిపూట బడులు మొదలుకానున్న నేపథ్యంలో రాధేశ్యామ్ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు. ఆర్ఆర్ఆర్ రిలీజయ్యే సమయానికి రాధేశ్యామ్ మెజారిటీ ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది హోలీ పండుగ సెలవు కూడా ఈ సినిమాకు ప్లస్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజయ్యే వరకు రాధేశ్యామ్ కు పోటీ లేదనే చెప్పాలి. అయితే రాధేశ్యామ్ యూనిట్ కీలక సభ్యులు చేస్తున్న కామెంట్లు మాత్రం ప్రభాస్ అభిమానులకు కూడా నచ్చడం లేదు.
క్రిటిక్స్ కామెంట్లను, ప్రేక్షకుల కామెంట్లను తిప్పికొడుతూ థమన్, మనోజ్ పరమహంస, రాధాకృష్ణ కుమార్ కామెంట్లు చేశారు. అయితే యావరేజ్ టాక్ వచ్చిన రాధేశ్యామ్ సినిమా విమర్శల విషయంలో స్పందించి సమాధానాలు ఇవ్వడం వల్ల సినిమాకు మేలు జరగదు. రాధేశ్యామ్ యూనిట్ సభ్యులు తమ ప్రచారం తాము చేసుకుంటూ వెళితే బాగుంటుందని ప్రేక్షకుల అభిప్రాయాలను కించపరిచేలా కామెంట్లు చేయడం వల్ల లాభం ఉండదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రాధేశ్యామ్ యూనిట్ సభ్యులు ఇకనైనా ఈ విషయంలో మారతారేమో చూడాల్సి ఉంది. మూడు రోజుల్లో రూ.75 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను రాధేశ్యామ్ సాధించగా 125 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు రావాల్సి ఉంది. హిందీలో ఈ సినిమా కలెక్షన్లు నిరాశాజనకంగా ఉన్నాయి.
Most Recommended Video
ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!