Prabhas: ప్రేమికుల రోజు పార్టీ సెట్ చేసిన రాధేశ్యామ్ టీమ్!

రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెడుతున్న విషయం తెలిసిందే. ఒక సినిమా తరువాత మరో సినిమాను వెను వెంటనే ఫినిష్ చేసేలా పక్కా ప్రణాళికలతో ముందుకు వెళుతున్నాడు. ఒక్కో సినిమాకు 100 నుంచి 150 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్న డార్లింగ్ రానున్న రోజుల్లో ఆ సంఖ్యను మరింత పెంచుకునే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అయితే ఇటీవల విడుదల కావాల్సిన ఈ సినిమా అనుకోకుండా వాయిదా పడిన విషయం తెలిసిందే.

Click Here To Watch

అయితే ఆ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఫిబ్రవరి 14 సినిమాకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన పార్టీని నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. నైట్ థీమ్ పార్టీ పేరుతో ఒక ప్రత్యేకమైన సెట్ కూడా నిర్మించారట. ఆ సెట్ సినిమా అసలు కథ ప్రతిబింబించేలా రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ నైట్ పార్టీలో చిత్ర యూనిట్ సభ్యులు అందరూ పాల్గొనబోతున్నారట. రాత్రి 8 గంటలకు మొదలయ్యే ఈ పార్టీ సినిమాకు మంచి ప్రమోషన్ క్రియేట్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా అనుకోకుండా కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక ఫైనల్ గా మార్చ్ 11వ తేదీన సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను యువి క్రియేషన్స్ గోపి కృష్ణ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించారు. జిల్ దర్శకుడు రాధాకృష్ణ ఈ సినిమాను డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక సంబంధించిన పాటలు కూడా సోషల్ మీడియాలో మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్నాయి.

ఇక ప్రమోషన్లో భాగంగా మరొక ట్రైలర్ లేదా టీజర్ ను కూడా విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus