Radhe Shyam Movie: పుష్ప కంటే భారీగా రాధేశ్యామ్ ఈవెంట్!

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాల్లో రాదేశ్యామ్ కూడా టాప్ లిస్టులో ఉంది. రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవాలని అనుకుంటున్నాడు. సాహో సినిమాతో ఊహించని విధంగా కాస్త నెగటివ్ ఫలితాన్ని అందుకున్న డార్లింగ్ ఈ లవ్ స్టోరీతో మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవాలని చూస్తున్నాడు. అయితే సినిమాకు సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాయి.

ఇక చిత్ర యూనిట్ సభ్యులు రెగ్యులర్ ప్రమోషన్ లో బిజీ ఇవ్వాలని చూస్తున్నారు. ఇక సినిమాకు సంబందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా ఏర్పాట్లు మొదలుపెట్టారు. నిర్మాతలు యూవి క్రియేషన్స్ ఈ ఈవెంట్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించాలని చూస్తున్నారు. ఇక ఇటీవల పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పుడు రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా అంతకు మించి అనేలా నిర్వహించాలని అనుకుంటున్నారు.

ఇక రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ నెల 23న నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ప్రీ రిలీజ్ వేడుకలోనే ట్రైలర్ ను కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందట. గతంలో ఎప్పుడు లేని విధంగా సినిమాకు సంబంధించిన ప్రమోషన్ ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ ప్రాజెక్ట్ K షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇక సినిమా డబ్బింగ్ పనులన్నీ కూడా ఫినిష్ అయినట్లు తెలుస్తోంది. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను జనవరి 14న విడుదల చేయబోతున్నారు.

గత ఏడాది నుంచి అభిమానులను ఎంతగానో ఊరిస్తున్న రాధేశ్యామ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి. ఇక ఈ సినిమా అనంతరం ప్రభాస్ సలార్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాపై కూడా బాక్సాఫీస్ అంచనాలు గట్టిగానే ఉన్నాయి.

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!

Most Recommended Video

మహేష్ టు నవీన్… ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన హీరోల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!
అఘోరా గెటప్‌ టాలీవుడ్‌ హీరోలకు కలిసొచ్చిందా!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus