ఈ సైజ్‌లు చాలవు.. ఇంకా పెంచమన్నారు.. స్టార్‌ హీరోయిన్‌ రచ్చ రచ్చ చేస్తోందిగా..

ప్రముఖ బాలీవుడ్‌ నటి రాధికా ఆప్టే మాటలు వింటుంటే.. దక్షిణాది సినిమాలు, ఇక్కడి మనుషులు భయంకరమైన వ్యక్తులు అని చెప్పాలనుకుంటోంది అని స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే ఇప్పటికే సినిమా సెట్స్‌లో ఇబ్బందుల గురించి మాట్లాడింది. అయితే సౌత్‌లో ఏ భాష, ఏ సినిమా సమయంలో ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనేది చెప్పలేదు. మొత్తంగా సౌత్‌లో ఆమె 10 సినిమాలు చేసింది. అందులో ఏదో చెప్పడం ఎవరితరమూ కాదు. అయితే ఇప్పుడు మరికొన్ని కామెంట్స్‌ బయటకు వచ్చాయి.

Radhika Apte

ఆమె డబ్బుల కోసం (ఆమె చెప్పిన మాటే ఇది) దక్షిణాదిలో సినిమాలు చేస్తున్న సందర్భంలో.. ఓ సినిమా టీమ్‌ ఆమెను ఇబ్బంది పెట్టింది. సైజ్‌లు పెంచేందుకు ప్యాడింగ్ చేసుకోమని ఒత్తిడి చేశారట. చాలా పెద్దగా కనిపించేలా చేయాలని చెప్పారని, అది ఇబ్బందిగా అనిపించిందని రాధిక చెప్పుకొచ్చింది. తన పిరుదులు, బ్రెస్ట్ పెద్దగా కనిపించేందుకు ప్యాడింగ్ చేయాలని ఆ సినిమా టీమ్‌ ఆమెకు చెప్పారట. దాంతో ఆమె ఆగ్రహానికి లోనై సినిమా టీమ్‌ను పిలిచి అరిచేసిందట. ప్యాడింగ్ చేసుకోనని డైరెక్టర్‌కి తెగేసి చెప్పిందట.

రాధిక సౌత్‌లో నటించిన సినిమాలు చూస్తే తమిళంలో ‘ధోనీ’, ‘ఆల్‌ ఇన్‌ ఆల్‌ అలగు రాజా’, ‘వెట్రి సెల్వన్‌’, ‘కబాలి’, ‘చితిరం పేసుతాది 2’లో నటించింది. ఇక తెలుగులో ‘రక్త చరిత్ర’, ‘రక్త చరిత్ర 2’, ‘లెజెండ్‌’, ‘లయన్‌’ సినిమాలు చేసింది. ఈ క్రమంలో ఆమె కొన్ని గ్లామరస్‌ రోల్స్‌ అయితే వేసింది. మరి వాటిలో ఎందులో ఆమెను ప్యాడింగ్‌ చేయమన్నారో తెలియదు. అప్పట్లో రియాక్ట్‌ అవ్వకుండా ఫ్లైట్‌ ఎక్కి ముంబయి వెళ్లిపోయిన రాధిక.. ఇప్పుడు ఎందుకు ఆ విషయాలు చెబుతోందో ఆమెకే తెలియాలి.

గతంలో కొంతమంది హీరోయిన్లు ఇలానే సౌత్‌ సినిమాల గురించి మాట్లాడారు. అయితే ఇదే సమయంలో నార్త్‌ సినిమాల గురించి కూడా ఇలా మాట్లాడేవారు ఉన్నారు. కాబట్టి సినిమా పరిశ్రమలో ఈ కామెంట్స్‌ కామన్‌. ఎవరు, ఏ సినిమా అనేది చెబితే ఇంకాస్త నమ్మబుల్‌గా ఉంటుంది. ఆ పని నాయికలు ఎందుకో కానీ చేయడం లేదు. అన్నట్లు నార్త్‌ సినిమా జనాల గురించి కూడా రాధిక ఇలానే కామెంట్లు చేసింది.

ఆ ‘ఓజీ’ సీన్‌ ఒరిజినల్‌ కాదు.. కాపీనే అంటున్న సుజీత్‌.. ఎవరు తొలుత తీశారంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus