Sujeeth: ఆ ‘ఓజీ’ సీన్‌ ఒరిజినల్‌ కాదు.. కాపీనే అంటున్న సుజీత్‌.. ఎవరు తొలుత తీశారంటే?

సగటు ప్రేక్షకులకు ‘ఓజీ’ సినిమా ఎంతగా నచ్చింది అనేది పక్కన పెడితే.. పవర్‌స్టార్‌ ఫ్యాన్స్‌కి మాత్రం సినిమా బాగా నచ్చేసింది. ఎంతగా అంటే ఓటీటీలో సినిమాను రిపీట్‌ మోడ్‌లో చూస్తున్నారు. అందులో ఒక్కో సీన్‌ని రివైండ్‌ చేసుకొని మరీ ఎంజాయ్‌ చేస్తున్నారు. అలాంటి వాటిలో కెమెరాను రివర్స్‌లో పవన్‌ కాళ్లను, గేట్‌ వే ఆఫ్ ఇండియాను కలిపి తీసిన ఎలివేషన్‌ సీన్‌. సినిమాలో ఈ సీన్‌కి భలే స్పందన వచ్చింది. సినిమ షూటింగ్‌లో ఉన్నప్పుడు కూడా ఆ సీన్‌ గురించి అందరూ చెప్పుకున్నారు..

Sujeeth

ఆ సీన్‌ కోసం ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ రవి.కె.చంద్రన్‌ చాలా కష్టపడ్డారు. వేకువజామునే ముంబయి గేట్‌ వే ఆఫ్ ఇండియా దగ్గర సీన్‌ కోసం ఏర్పాట్లు చేసుకొని సన్‌ రైజ్‌ సమయంలో ఆ సీన్‌ తీశారట. దీని గురించి కథానాయకుడు పవన్‌ కల్యాణ్ ఆ మధ్య గొప్పగా చెప్పారు కూడా. దీని కోసం పవన్‌ కూడా చాలా సేపు వెయిట్‌ చేసి మరీ సీన్‌ కరెక్ట్‌గా వచ్చేంతవరకు ఓపికగా ఉన్నారట. అయితే అంతటి సీన్‌ కాపీ అని తెలుసా? అవును మీరు చదివింది నిజమే. అయితే కాపీ తన కంటెంట్‌ నుండి తనే చేశాడు దర్శకుడు సుజీత్‌.

కొత్త ట్రెండ్ రౌండ్‌ టేబుల్‌ ఇంటర్వ్యూలో దర్శకుడు సుజీత్‌ కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో ‘ఓజీ’ సినిమా తెర వెనుక విశేషాలను పంచుకున్నారు. అప్పుడే కెమెరాను రివర్స్‌లో పెట్టి నీటి ప్రతిబింబంలో పవన్‌ కల్యాణ్‌ను చూపించే షాట్ గురించి డిస్కషన్‌ నడించింది. ఈ షాట్‌ తనకు కొత్త కాదని.. తాను డైరెక్టర్ కాకముందే ఆ షాట్‌ని పిక్చరైజ్‌ తీసినట్లు సుజీత్ తెలిపాడు. షార్ట్ ఫిల్మ్స్‌ తీసే రోజుల్లోనే ఆ షాట్ తీసినట్లు చెప్పారు. అయితే ఆ షార్ట్ ఫిలిమ్‌ను ఎవ్వరూ పట్టించుకోలేదని నవ్వేశాడు.

యూట్యూబ్‌లో ఆ షార్ట్‌ ఫిలిమ్‌కు వంద పైచిలుకు వ్యూస్ ఉన్నాయని.. ఇదే షాట్ ‘ఓజీ’ సినిమాలో పెడితే ఆహా ఓహో అని కొనియాడారని సుజీత్‌ సంతోషపడ్డారు. అది బిగ్‌ స్క్రీన్‌, బిగ్గెస్ట్‌ స్టార్‌ మ్యాజిక్‌ మరి.

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus