ఇటీవలే ‘ఫోబియా’ చిత్రంలో భయపడుతూ తన నటనతో ఆకట్టుకున్న రాధికా ఆప్టే.. త్వరలో ఓ తిరుగుబాటు రచయిత పాత్రలో నటించనున్నారు. ఇందిరా గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు ఎటువంటి సంఘనలు చోటు చేసుకున్నాయన్న కథాంశంతో మధుర్ బండార్కర్ ‘మైన్, ఇందు’ అనే చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు.
ఈ చిత్రం లో రాధికా ఆప్టే ఓ తిరుగుబాటు రచయిత పాత్ర పోషిస్తోంది. ముందుగా ఈ పాత్రలో అనుష్క శర్మను అనుకున్నప్పటికీ.. చివరిగా రాధికానే చిత్ర బృందం ఖరారు చేశారు. మరోవైపు ఎమర్జెన్సీ రోజుల్లో ఏం జరిగింది అని తెలుసుకోవడానికి చిత్ర దర్శకుడు మధుర్ ఇటీవలే బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామిని కలిసినట్లు