‘టాలీవుడ్’ పై నోరు జారిన రాధిక ఆప్టే!

ఈ మధ్య హీరోయిన్స్ కు నోరుజారడం పెద్ద అలవాటుగా మారిపోయింది. ఏమనుకుని మాట్లాడతారో ఏమో తెలీదు కానీ, కనీసం వాళ్ళు చెప్పేది తప్పు అని సైతం అర్ధం కాదు వాళ్ళకి. తాజాగా కబాలి సినిమాలో నటించిన రాధిక ఆప్టే విషయమే తీసుకుంటే రజనికాంత్ తో సినిమా చేసింది అన్న అహంకారమో, ఏమో తెలీదు కానీ, ఒక్కసారిగా తెలుగు సినిమా పరిశ్రమపై, తెలుగు హీరోల తీరుపై విరుచుకు పడింది. విషయంలోకి వెళితే….రాధికా ఆప్టే తాను నటించిన ‘కబాలి’సినిమాను ప్రమోట్ చేసే క్రమంలో టాలీవుడ్ పై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడింది. ఆమె మాట్లాడుతూ…టాలీవుడ్లో హీరోయిన్లకు అస్సలు ప్రాధాన్యం ఇవ్వరని, హీరోలకు ఇచ్చే ట్రీట్మెంట్ హీరోయిన్లకు ఉండదని వాళ్లను చిన్న చూపు చూస్తారని అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

అంతేకాకుండా దొరికిందే అవకాశంగా రజనీకాంత్ ను, తమిళ పరిశ్రమను అక్కశానికి ఎత్తేసింది. రజినీతో సినిమా చేయడం తాను జీవితంలో మరిచిపోలేని విషయమని అంటూ, పైగా తాను రజని ఫ్యాన్ ని అంటూ తెలుపుతూ…తాను తొలి రోజు షూటింగ్ కి వెళ్ళడంతో కాస్త కంగారు అనిపించింది, కానీ అక్కడ వాతావరణం మాత్రం చాలా కూల్ గా ఉంది అని, పైగా రజని తన గురించి ఎదురు చూడడమే కాకుండా, తనను ఎంతో ఆప్యాయంగా పలకరించారని రాధిక చెబుతూ, ఈ రిసీవింగ్ తెలుగులో ఎక్కడ ఉంది అని నోరు జారింది. దాదాపుగా బాలయ్యతో రెండు బడా సినిమాలు చేసిన ఈ అమ్మడు అలా మాట్లాడటం చూస్తే…దీనిపై బాలయ్య అభిమానులు కోపంగా ఉన్నారని తెలుస్తుంది. మరి దీనిపై వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus