మెగాస్టార్ చిరంజీవి, నటి రాధికా శరత్ కుమార్ ఒకప్పుడు జంటగా ఎన్నో సినిమాలు చేశారు. వీరిద్దరిదీ సూపర్ హిట్ కాంబినేషన్. అందుకే దర్శకనిర్మాతలు తమ సినిమాల్లో చిరు-రాధికాల కాంబోను తీసుకోవడానికి ఆసక్తి చూపేవారు. చిరంజీవి ఇప్పటికీ హీరోగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. కానీ రాధికా మాత్రం మదర్ రోల్స్ చేస్తోంది. కోలీవుడ్ లో విజయ్, విశాల్ ఇలా చాలా మందికి తల్లిగా నటించింది. కానీ చిరంజీవికి మాత్రం తల్లిగా నటించనని ఇటీవల తేల్చి చెప్పింది రాధికా.
రీసెంట్ గా ఓ షోకి గెస్ట్ గా వచ్చిన ఆమె ఒక సినిమాలో చిరంజీవిని కొట్టానని చెప్పుకొచ్చింది. ‘న్యాయం కావాలి’ సినిమా తన లైఫ్ లో టర్నింగ్ పాయింట్ అని.. అందులో చిరంజీవిని కొట్టి కొట్టి మాట్లాడే సన్నివేశం ఉంటుందని చెప్పింది. దానికోసం 23 టేక్స్ తీసుకున్నానని.. ఆ తరువాత చిరంజీవి ముఖం చూస్తే మొత్తం రెడ్ గా అయిపోయిందని.. అంత గట్టిగా కొట్టేశానని చెప్పుకొచ్చింది. ఆ తరువాత ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఉంటే అవకాశాలు తగ్గాక..
తల్లి పాత్రలు చేయాలనే ఫార్మాట్ ఉందని.. అది ఫాలో అవ్వడం తనకు ఇష్టం లేదని చెప్పుకొచ్చింది. అందుకే బుల్లితెరపై సీరియల్స్ చేశానని తెలిపింది. ఆమె నటించిన ఎన్నో సీరియల్స్ సూపర్ సక్సెస్ అయ్యాయి. కొన్ని తమిళ సీరియల్స్ తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. సినిమాల విషయానికొస్తే.. రాధికా ఇటీవల విడుదలైన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాలో ముఖ్యపాత్రలో కనిపించింది.