పి.వాసు దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన చంద్రముఖి సినిమాకు సీక్వెల్ చిత్రంగా దాదాపు 17 సంవత్సరాలకు చంద్రముఖి 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా చంద్రముఖి సినిమా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయిన మిశ్రమ స్పందన అందుకుంది. ఇక ఈ సినిమాకు చంద్రముఖి సినిమా డైరెక్టర్ పి వాసు దర్శకత్వం వహించినప్పటికీ రజినీకాంత్ జ్యోతిక వంటి సెలబ్రిటీలు మాత్రం ఈ సినిమాలో నటించలేదని చెప్పాలి. చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ నటన అద్భుతం
ఇక సీక్వెల్ చిత్రంపై రజనీకాంత్ ఆసక్తి చూపించకపోవడంతో రజినీకాంత్ స్థానంలో నటుడు రాఘవ లారెన్స్ నటించిన అలాగే జ్యోతిక స్థానంలో బాలీవుడ్ నటి కంగనా నటించారు. ఇలా ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా చంద్రముఖి స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందని చెప్పాలి. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సీక్వెల్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
అయితే ఈ సినిమా కోసం నటుడు లారెన్స్ (Raghava Lawrence) తీసుకున్నటువంటి రెమ్యూనరేషన్ గురించి ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా కోసం లారెన్స్ ఏకంగా 30 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నారని కోలీవుడ్ సమాచారం. ఇలా లారెన్స్ 30 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోవడం అంటే పెద్ద మొత్తమే అని చెప్పాలి.
ఇప్పటివరకు లారెన్స్ ఏ సినిమాకు గాను ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకోలేదని చంద్రముఖి సినిమాకి ఈయన భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. మరి లారెన్స్ రెమ్యూనరేషన్ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!
చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !