తెలుగులో టాప్ హీరోలు మినహా అందరు యంగ్ హీరోస్ & డైరెక్టర్స్ మీద నీచమైన కామెంట్స్ చేసి వాళ్ళకి రచ్చకీడ్చుదామనే ప్రయత్నంలో తన ఉనికిని కోల్పోయిన శ్రీరెడ్డి.. ఇక తెలుగులో తనను ఎవరూ పట్టించుకోరనే విషయాన్ని గమనించి తమిళ చిత్రసీమకి పారిపోయిన విషయం తెలిసిందే. పోనీ అక్కడికి వెళ్ళి ఏమైనా కుదురుగా ఉందా అంటే.. అక్కడ కూడా విశాల్, కార్తీ, రాఘవ లారెన్స్ లాంటి ప్రముఖుల కథానాయకుల మీద కామెంట్స్ చేయడం, అక్కడి చానల్స్ మరియు యూట్యూబ్ చానల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చి అక్కడ కూడా నానా హంగామా చేయడం మొదలెట్టింది.
అయితే.. మన తెలుగు హీరోలు, దర్శకుల్లా లారెన్స్ సైలెంట్ గా కూర్చోలేదు. శ్రీరెడ్డికి చాలా గట్టి కౌంటర్ ఇచ్చాడు. “శ్రీరెడ్డి ఏదో చెప్పింది కదా అని భయపడి నేను ఈ స్టేట్ మెంట్ ఇవ్వడం లేదు. శ్రీరెడ్డి తానో నటినని, సరైన అవకాశాలు ఇవ్వకుండా అందరూ వాడుకొంటున్నారని చెప్పుకొంటోంది కాబట్టి.. నేను చెన్నైలో ఒక ప్రెస్ మీట్ పెట్టబోతున్నాను. అక్కడ శ్రీరెడ్డికి ఒక సన్నివేశంతోపాటు కొన్ని డ్యాన్స్ స్టెప్స్ కూడా కంపోజ్ చేసి ఇస్తాను, శ్రీరెడ్డి గనుక ఆ ఆడిషన్ లో నన్ను, ప్రెస్ ను ఇంప్రెస్ చేయగలిగితే నా తదుపరి చిత్రంలో మంచి ఆఫర్ ఇస్తాను” అని ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు రాఘవ లారెన్స్. మరి లారెన్స్ మాస్టర్ కండెక్ట్ చేసే ప్రెస్ మీట్ కి వచ్చి తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకొని యాక్టింగ్ ఛాన్స్ సొంతం చేసుకొంటుందో లేక ఎప్పట్లానే మొహం చాటేస్తుందో చూడాలి. ఏదేమైనా లారెన్స్ మాస్టర్ మాత్రం శ్రీరెడ్డి నోరు భలే మూయించాడు.