‘ఎవ్వరికీ చెప్పొద్దు’ పై దర్శకేంద్రుడి ప్రశంసలు..!

సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సినిమాల పై ప్రేక్షకులకి మంచి నమ్మకం ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నిర్మించే సినిమాల పై మాత్రమే కాదు ఆయన డిస్ట్రిబ్యూట్ చేసే సినిమాల పై కూడా మంచి నమ్మకం ఏర్పడుతుంది. తాజాగా ఆయన రిలీజ్ చేసిన ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ విషయంలో కూడా అదే జరిగింది. దిల్ రాజు విడుదల చేస్తున్నాడు అని మొదటి నుండీ ఈ చిత్రం పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే అక్టోబర్ 8న( నిన్న) విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుత సమాజంలో ‘క్యాస్ట్ ఫీలింగ్’ అనేది జనాల్ని ఎలా ప్రభావితం చేస్తుంది. ‘కులం ముఖ్యం కాదు వ్యక్తిత్వం ముఖ్యం’ అనే లైన్ ను చాలా అందంగా మలిచాడు దర్శకుడు బసవ శంకర్.

ఇక పాజిటివ్ టాక్ సంపాదించుకున్న ఈ చిత్రానికి మరింత ఆదరణ పెరుగుతుంది. ఇక తాజాగా ఈ చిత్రం అద్భుతం అంటున్నారు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు. తన ట్విట్టర్ ద్వారా ఈ చిత్రం పై ఆయన స్పందిస్తూ… ” ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ చిత్రం యూనిట్ సభ్యులందరికీ నా అభినందనలు. ప్రతీ ఏరియా నుండీ ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తుంది. దర్శకుడు బసవ శంకర్ ఈ చిత్రాన్ని చాలా కొత్తగా.. యూత్ అందరికీ నచ్చేలా తీర్చిదిద్దాడు. రాకేష్, గార్గేయి నటన కూడా చాలా ఇంప్రెసివ్ గా ఉంది” అంటూ ప్రశంసలు కురిపించారు.

ఎవ్వ‌రికీ చెప్పొద్దు సినిమా రివ్యూ & రేటింగ్!
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus