Raghavendra Rao: మరో భక్తిరస చిత్రం తెరకెక్కించున్న రాఘవేంద్రరావు!

సినిమాలను ‘రక్తి’కట్టించాలన్నా… ‘భక్తి’ప్రపత్తులు పెంచాలన్నా టాలీవుడ్‌లో వినిపించే ఏకైక పేరు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు. సినిమాల సెంచరీ కొట్టేసిన రాఘవేంద్రరావు… ఆ తర్వాత తన సినిమాల జోరు తగ్గించారు. చేసిన సినిమాలు కూడా దేవుడి సినిమాలే. ఆయన ఆఖరి రెండు సినిమాలు ‘శిరిడీ సాయి’, ‘ఓం నమో వేంకటేశాయ’. ఇప్పుడు మరో సినిమాకు సిద్ధమవుతున్నారు దర్శకేంద్రుడు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనారసింహ స్వామి కథను సినిమా తీయాలనే ఆలోచనలో రాఘవేంద్రరావు ఉన్నారట. ఇటవల యాదాద్రి దర్శనానికి వచ్చిన రాఘవేంద్రరావు ఈ మేరకు వెల్లడించారు.

యాదాద్రిపై ఆధ్యాత్మిక చలనచిత్రాన్ని తీయాలనే కోరిక ఉందంటూ మనసులో మాట బయటపెట్టారు రాఘవేంద్రరావు. విజయదశమి సందర్భంగా శుక్రవారం యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. యాదాద్రి పుణ్య క్షేత్రం భవిష్యత్తులో మరో తిరుమలగా పేరొందుతుందని రాఘవేంద్రరావు ఆనందం వ్యక్తం చేశారు. దేవాలయాన్ని కృష్ణశిలతో రూపొందించడం మహాత్కార్యం అన్నారాయన. తెలంగాణ సీఎం కేసీఆర్‌ది మహాయజ్ఞమని వ్యాఖ్యానించారు.మరి సినిమా రూపొందించేటప్పుడు రాఘవేంద్రరావు ఏం చూపించబోతున్నారనేది ఆసక్తికరం. దేవుని నేపథ్యంలో సినిమా ఉంటుందా? ప్రస్తుత పరిస్థితులు వివరించేలా ఉంటుందా అనేది తెలియాలి.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus