Rahul Ramakrishna: నటుడు ప్రియదర్శి గురించి రాహుల్ రామకృష్ణ సంచలన ట్వీట్!

తెలుగు సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటుడు రాహుల్ రామకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పలు సినిమాలలో కమెడియన్ గా నటించి ఎంతో మంచి కృతజ్ఞతలు సంపాదించుకున్నటువంటి ఈయన కొన్ని సార్లు సోషల్ మీడియా వేదికగా చేసే పోస్టులు కాస్త వివాదాలకు కూడా కారణం అవుతూ ఉంటాయి. తాజాగా ఇంటింటి రామాయణం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే.

ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో కొందరు ఈ సినిమాని నటుడు ప్రియదర్శి నటించిన బలగం సినిమాతో పోల్చి కామెంట్స్ చేస్తున్నారు.ఇలా బలగం సినిమాలాగే ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది అంటూ బలగం సినిమాతో పోల్చి ఇంటింటి రామాయణం సినిమా గురించి పోస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ పోస్టులు కాస్త (Rahul Ramakrishna) రాహుల్ రామకృష్ణ కంటపడ్డాయి.

ఇలా ఈ పోస్టులు చూస్తున్నటువంటి ఈయన వీటిపై స్పందిస్తూ తన స్టైల్ లో కామెంట్స్ చేస్తూ చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ సందర్భంగా రాహుల్ రామకృష్ణ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ప్రియదర్శి నా ప్రాణమిత్రుడు మంచి నటుడు అలాంటి వ్యక్తితో నన్ను పోల్చడం అంటే నిజంగానే ప్రియదర్శిని అవమానపరిచినట్లేనని ఈయన తెలిపారు. ప్రియదర్శి మంచి నటుడు మాత్రమే కాదు ఒక మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి కూడా.

ఇలా నా సినిమాని అతని సినిమాతో పోల్చి కామెంట్ చేయడం మీ పిరికితనం అనిపిస్తుంది. నేను తన బాటలోనే నడుస్తున్నాను అంటూ ఈ సందర్భంగా రాహుల్ రామకృష్ణ ప్రియదర్శి గురించి చేసినటువంటి ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక బలగం సినిమా కమెడియన్ వేణు దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus