టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా, కమెడియన్ గా రాహుల్ రామకృష్ణ పాపులారిటీని సంపాదించుకున్నారనే సంగతి తెలిసిందే. రాహుల్ రామకృష్ణ కామెడీకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలో రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలో నటించారు. అయితే ట్రైలర్ లో ఆ పాత్రకు సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడి కాలేదు. జాతిరత్నాలు సినిమా రాహుల్ రామకృష్ణకు కమెడియన్ గా పాపులారిటీని పెంచింది. ఈ సినిమాలో రాహుల్ తనదైన శైలిలో చెప్పిన డైలాగ్స్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
అయితే తాజాగా రాహుల్ రామకృష్ణ సంచలన నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇకపై తాను సినిమాలలో నటించనని ఆయన చెప్పుకొచ్చారు. ఈ ఏడాది వరకు మాత్రమే సినిమాలలో నటిస్తానని ఈ ఏడాది తర్వాత తాను సినిమాలలో నటించనని రాహుల్ రామకృష్ణ కామెంట్లు చేశారు. అయితే రాహుల్ రామకృష్ణ అనూహ్య నిర్ణయం తీసుకోవడం వెనుక కారణాలు తెలియాల్సి ఉంది. ట్విట్టర్ వేదికగా రాహుల్ రామకృష్ణ ఈ విషయాన్ని ప్రకటించగా అభిమానులు ఈ ప్రకటనతో షాకవుతున్నారు.
రాహుల్ రామకృష్ణ సినిమాలకు దూరం కావడానికి ఏదో ఒక బలమైన కారణం ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఎవరేం చెప్పినా తాను ఇదే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని రాహుల్ రామకృష్ణ ప్రకటించడం గమనార్హం. మరి కొందరు మాత్రం ఏదైనా సినిమా లేదా వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా రాహుల్ ఈ విధంగా చెప్పి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. రాహుల్ రామకృష్ణ లాంటి ప్రతిభ ఉన్న నటుడు సినిమాలకు దూరమైతే టాలీవుడ్ కు కొంతమేర నష్టమే అని చెప్పాలి.
జయమ్ము నిశ్చయమ్మురా అనే సినిమాతో నటుడిగా రాహుల్ రామకృష్ణ కెరీర్ ను మొదలుపెట్టారు. అర్జున్ రెడ్డి, గీతా గోవిందం సినిమాలు నటుడిగా రాహుల్ రామకృష్ణకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. 2020 సంవత్సరంలో విజయం సాధించిన అల వైకుంఠపురములో సినిమాలో ఒక చిన్నపాత్రలో రాహుల్ రామకృష్ణ మెరిశారు.
2022 is my last.
I will not do films anymore.
Not that I care, nor should anybody care