నోయెల్ సింపతీ కోసం ఆడడు!

బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ గా నిలిచిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్, సింగర్ నోయెల్ మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. సీజన్ 3 సమయంలో రాహుల్ కి తన సపోర్ట్ అందించాడు నోయెల్. సోషల్ మీడియాలో రాహుల్ ని బాగా ప్రమోట్ చేశాడు. ఇప్పుడు సీజన్ 4లో పాల్గొన్న నోయెల్ కి ఓట్లు వేయాలని తన అభిమానులను కోరుతున్నాడు రాహుల్. కొన్ని రోజులుగా నోయెల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడని.. ప్రేక్షకుల్లో సింపతీ పెంచుకోవడం కోసం అబద్ధాలు కూడా చెబుతున్నాడని అతడిని ట్రోల్ చేస్తున్నారు.

ఇప్పటికే ఈ విషయంపై నోయెల్ తమ్ముడు క్లారిటీ ఇచ్చాడు. అయినప్పటికీ నోయెల్ ని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఈ ట్రోల్స్ పై మండిపడ్డాడు సింగర్ రాహుల్ సింప్లిగంజ్. నోయెల్ మంచితనాన్ని తెలియజేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. అందులో ఎన్నో విషయాల గురించి మాట్లాడాడు. నోయెల్ చాలా జెన్యూన్ అని.. తనకు సొంత బ్రదర్ లాంటి వాడని అన్నారు. ట్రోల్స్ అనేవి వస్తూనే ఉంటాయని.. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నాడు. నోయ్ బాగా ఆడుతున్నాడని.. కానీ అతి మంచితనం కనిపిస్తుందని అన్నారు. నోయెల్ కి ఓట్లు వేసి గెలిపించమని కోరాడు.

తన అభిమానులంతా నోయెల్ కి సపోర్ట్ చేయాలని.. నోయెల్ చాలా మంచి వాడని అన్నారు. కానీ అతనిపై ఫేక్ ట్రోల్స్ వస్తున్నాయని.. సింపతీ కోసం ఫేక్ గేమ్ ఆడుతున్నాడని ట్రోల్ చేస్తున్నారని.. తనకు తెలిసిన నోయెల్ సింపతీ కోసం గేమ్ ఆడడని క్లారిటీ ఇచ్చాడు రాహుల్. ఈ ఫేక్ ట్రోల్స్ ని నమ్మొద్దని కోరారు. బయటకి వస్తున్న కంటెస్టెంట్ లంతా కూడా నోయెల్ గురించి పాజిటివ్ గానే చెబుతున్నారని వెల్లడించారు రాహుల్.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus