Rahul Sipligunj: సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న రాహుల్ సిప్లిగంజ్.. అమ్మాయి ఎవరంటే?

బిగ్ బాస్ సీజన్ 3 విన్న‌ర్‌, స్టార్ సింగర్ అయినటువంటి రాహుల్ సిప్లిగంజ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అవును రాహుల్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్నాడు. హైదరాబాద్‌కు చెందిన హరిణ్యా రెడ్డి అనే అమ్మాయిని రాహుల్ పెళ్లిచేసుకోబోతున్నాడు. సైలెంట్ ఇతని ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయింది. ఆగస్టు 17న అంటే ఆదివారం నాడు ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ మధ్య వీరి నిశ్చితార్థ వేడుక నిరాడంబరంగా జరిగింది.

Rahul Sipligunj

ఫోటోలు కొంచెం ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. సోషల్ మీడియాలో ప్రస్తుతం అవి వైరల్ గా కూడా మారాయి. నెటిజెన్లు రాహుల్ కి కంగ్రాట్స్ అంటూ తమ బెస్ట్ విషెస్ ను తెలియజేస్తున్నారు.త్వరలోనే వీరి పెళ్లి వేడుక బంధుమిత్రుల సమక్షంలో హైదరాబాద్లో జరగనుంది అని సమాచారం.

ఇదిలా ఉండగా.. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గతంలో లవ్ స్టోరీస్ చాలానే నడిపించాడు అనే వార్తలు వచ్చాయి. ‘బిగ్ బాస్’ సీజన్ 3 లో తోటి కంటెస్టెంట్ పునర్నవి భూపాలంతో రాహుల్ ప్రేమాయణం నడిపాడు. హౌస్ నుండి బయటకు వచ్చాక కూడా వీరు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన సందర్భాలు ఉన్నాయి. అటు తర్వాత మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ రతిక రోజ్ తో కూడా రాహుల్ ప్రేమాయణం నడిపినట్టు టాక్ నడిచింది.

రతిక హౌస్ లోకి వెళ్లే ముందు.. పరోక్షంగా రాహుల్ గురించి కామెంట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే అషురెడ్డి, నందినీ రాయ్ వంటి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో కూడా రాహుల్ సిప్లిగంజ్ ప్రేమాయణం నడిపాడు అని గతంలో టాక్ నడిచిన సంగతి తెలిసిందే.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus