వరుణ్ తేజ్ ని ఇబ్బందిపెడుతున్న వరుణ దేవుడు!

సెప్టెంబర్ 13న విడుదలవ్వాల్సిన చిత్రం “గ్యాంగ్ లీడర్” నిర్మాతల కోరిక మేరకు 20వ తారీఖుకి పోస్ట్ పోన్ అయ్యింది.. సరిగ్గా విడుదల ముందు రోజు టైటిల్ బలవంతంగా మార్చబడింది. మొదటిరోజు కొన్ని ఊర్లలో షోలు పడలేదు. ఇంకొన్ని ఊర్లలో బలవంతంగా ఆపుజేయబడ్డాయి. ఇన్ని అవాంతరాలను తట్టుకొని కూడా విడుదలై మంచి టాక్ సంపాదించుకొన్న “వాల్మీకి” అలియాస్ “గద్దలకొండ గణేష్” చిత్రం మంచి రివ్యూలు, కలెక్షన్స్ & వర్డ్ ఆఫ్ మౌత్ సంపాదించింది. మొదటి వారాంతంలోనే 30 కోట్ల రూపాయల వసూళ్లు కూడా సాధించింది. ఇంకోవారం ఇదే స్థాయి కలెక్షన్స్ వస్తే అందరికీ లాభాలు వచ్చేవి. కానీ.. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు.. ఎన్నో వైపరీత్యాలను ఎదుర్కొన్న వాల్మీకి బృందానికి ప్రకృతి మాత్రం సహకరించడం లేదు.

గత మూడు రోజులుగా ఆంధ్రా-తెలంగాణ ప్రాంతాల్లో ఇబ్బడిముబ్బడిగా కురుస్తున్న వర్షం కారణంగా చాలా థియేటర్లు షోస్ క్యాన్సిల్ చేయగా.. ఇంకొన్ని ఏరియాల్లో జనాలు ఇల్లు వదిలి బయటకు రాలేకపోతున్నారు. తమిళనాడులో అప్పట్లో అజిత్ నటించిన “వేదాలమ్” విడుదలై వంద కోట్ల కలెక్షన్స్ దిశగా దూసుకుపోతుండగా.. తమిళనాట వరదల కారణంగా ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది కానీ.. కలెక్షన్స్ మాత్రం రాలేదు. ఇప్పుడు వాల్మీకి పరిస్థితి కూడా అలాగే తయారయ్యింది.

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus