ఆ సినిమా ఇప్పుడు తీసుంటే ఆడేదేమో.. డిజాస్టర్‌ మూవీపై స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

కొన్ని సినిమాలు లేట్‌ అయిపోతుంటాయి.. మరికొన్ని సినిమాలు ఎర్లీగా వచ్చేస్తుంటాయి. ఇందులో ఏది జరిగినా ఇబ్బందే. ముందు రావాల్సిన సినిమా లేట్‌ అయితే ఇప్పటి తరానిది కాదు అని అంటారు. అదే తర్వాత తరాన్ని ఉద్దేశించి తీసిన సినిమా ఇప్పుడే వచ్చేస్తే ఇప్పటి సినిమా కాదు అని అంటుంటారు. ఈ డిసైడింగ్‌ టాలెంట్‌ ఎంత పెద్ద హీరోకైనా, దర్శకుడికైనా అంత ఈజీగా రాదు. అలా ఓ సినిమాను ముందుగానే తీసేసి తప్పు చేసేశాం అని అంటున్నారు ప్రముఖ బాలీవుడ్‌ హీరో షారుఖ్‌ ఖాన్‌.

Shah Rukh Khan

షారుఖ్‌ ఖాన్‌ ఇటీవల తన 60వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ సందర్బంగా అభిమానులతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెరీర్‌ గురించి, సినిమా కథల ఎంపిక గురించి.. ఇలా చాలా విషయాలు చెప్పుకొచ్చాడు. హీరో, విలన్‌ అనే తేడాను ప్రేక్షకులే సృష్టించారు. కెరీర్‌ ప్రారంభంలో ‘డర్‌’, ‘అంజామ్‌’, ‘బాజీగర్‌’ లాంటి సినిమాలు చేశాను. వాటిలోని పాత్రల్ని విలన్, స్టాకరే. నటులుగా ఆసక్తికరమైన పాత్రల గురించి చూడకపోతే కష్టమే అని చెప్పాడు షారుఖ్‌.

ఇప్పుడు యువత సినిమాలు చూస్తోంది. అలాంటప్పుడు తన లాంటి హీరోలు విభిన్న పాత్రలు చేయాలి. స్ఫూర్తిదాయకంగా, హాస్యభరితంగా, రొమాంటిక్‌గా ఉండాలి. ఇంకా చెప్పాలంటే నా పాత సినిమా ‘రా.వన్‌’ సినిమా ఇప్పుడు రావాల్సింది. ఆ సినిమా తీసినపుడు గొప్ప సినిమా తీశా అనుకున్నాను. కానీ అంచనాలను అందుకోలేకపోయింది. అప్పట్లో అలాంటి సినిమాలకు అంత ప్రాధాన్యత లేదు. ఇప్పుడు తీసుంటే బాగా ఆడేదేమో అని అన్నాడు షారుఖ్‌.

అంతేకాదు ఆ సినిమాకు సీక్వెల్‌ తీయాలని దర్శకుడు అనుభవ్‌ సిన్హా నిర్ణయించుకుంటే ‘రా.వన్‌’ వరల్డ్‌లోకి తిరిగి రావడానికి తాను సిద్ధం అని చెప్పాడు షారుఖ్‌. నిజంగానే ఆప్పట్లో ఆ సినిమాకు మంచి హైపే వచ్చింది. అయితే అంతగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది.. మన ట్రెండ్‌ పట్టుకుని ఇప్పుడు రీరిలీజ్‌ చేస్తారేమో చూడాలి.

తిరుమల ప్రసాదంపై కామెంట్స్‌.. ‘బిగ్‌బాస్‌’ శివజ్యోతి చిక్కుల్లో పడిందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus