హీరోగా నటించే చిత్రాల దర్శకులకు తాను ఎప్పుడు సలహా ఇవ్వలేదని యువహీరో రాజ్ తరుణ్ స్పష్టం చేసాడు. తనపై వచ్చిన వార్తలన్నింటికీ క్లారిటీ ఇచ్చాడు. పూర్వంలో షార్ట్ ఫిల్మ్ దర్శకుడైన రాజ్ తరుణ్ ఉయ్యాల జంపాల సినిమా ద్వారా హీరో గా మారాడు. సినిమా చూపిస్తా మామ, కుమారి 21ఎఫ్, ఈడోరకం, ఆడోరకం హిట్ లతో తెలుగు చిత్ర పరిశ్రమలోని యువహీరోల జాబితాలో చేరిపోయాడు.
అయితే తన వద్దకు కథతో వచ్చే దర్శకులకు, నిర్మాతలకు రాజ్ తరుణ్ సలహాలు, సూచనలు చేస్తున్నట్లు, ఇలా కథలో మార్పులు చేర్పులు చెబుతుండడం వల్ల హీరో ఛాన్సులు పోగొట్టుకుంటున్నట్లు ప్రచారం మొదలైంది. అతను చెప్పడం వల్ల ఓ నిర్మాత తన దర్శకుడిని కూడా మార్చేశారని కథనాలు వెలువడ్డాయి. వాటన్నింటిలో కొంత కూడా వాస్తవం లేదని రాజ్ తరుణ్ కొట్టిపడేశాడు. శనివారం తన ట్విట్టర్ అకౌంట్లో స్పందించాడు.
“ప్రస్తుతం నేను రెండు చిత్రాల్లో నటించడానికి ఒకే చెప్పాను. ఒకటి వంశీ కృష్ణ (దొంగాట) దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు. ఇందుకు గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. రెండో సినిమాకు సంజన దర్శకత్వం వహిస్తుండగా ఏకే ఎంటర్టైన్మెంట్స్, మారుతి కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు” అని వెల్లడించారు. “నా వద్దకు వచ్చిన వాళ్లకు నేను ఎప్పుడు సలహా ఇవ్వలేదు. నన్ను ఎవరూ పక్కకు తపించలేదు. నా వల్ల ఏ డైరక్టర్ ను రీప్లేస్ చేయలేదు” అని రాజ్ తరుణ్ స్పష్టం చేసాడు.
1. Just to clear all the confusions…..
I am shooting for 2 films right now.