‘కింగ్’ అక్కినేని నాగార్జున.. ‘ఘోస్ట్’ తర్వాత సినిమాలకు కొంత గ్యాప్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈసారి ఓ ఫ్యామిలీ మూవీ చేయాలని భావించారు. దీంతో ప్రసన్న కుమార్ ని డైరెక్టర్ గా పెట్టి ఓ సినిమా ప్లాన్ చేశారు. కానీ ఎందుకో ప్రసన్నని పక్కన పెట్టి ఛాన్స్ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చారు. ‘నా సామి రంగ’ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.
గతంలో విజయ్ బిన్నీ ‘ఛలో’ ‘నేను లోకల్’ వంటి హిట్ సినిమాలకి కొరియోగ్రాఫర్ గా చేశారు. ఇక ‘నా సామి రంగ’ చిత్రం ఓ మలయాళ సినిమాకి రీమేక్ అనే వాదనా ఉంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో రాజ్ తరుణ్, అల్లరి నరేష్ కూడా నటిస్తున్నట్టు టాక్ నడిచింది. అల్లరి నరేష్ సంగతి ఏమో కానీ, రాజ్ తరుణ్ మాత్రం ఈ సినిమాలో నటిస్తున్న మాట నిజం.
ఈ సినిమాలో అతి కీలకమైన పాత్రలో రాజ్ తరుణ్ కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం రాజ్ తరుణ్ ఏకంగా రూ.2 కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడట. ఈ సినిమాకి అనే కాదు.. గత సినిమాలకి కూడా రాజ్ తరుణ్.. అంతే పారితోషికం తీసుకున్న మాట నిజం. అయితే స్పెషల్ రోల్ కోసం కూడా అంత మొత్తం తీసుకోవడం అంటే చిన్న విషయం కాదు.
హీరోగా సినిమాలు చేస్తూ కూడా గెస్ట్ రోల్ కి అతను చేయడానికి ఒప్పుకుంది (Nagarjuna) నాగార్జున కోసం. ‘ఉయ్యాలా జంపాలా’ సినిమాతో రాజ్ తరుణ్ ను హీరోగా పరిచయం చేసింది నాగార్జునే అన్న సంగతి తెలిసిందే. అంతకు ముందు ‘మజ్ను’ లో కూడా చిన్న రోల్ చేసాడు అనుకోండి.
మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!
స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!