యాక్సిడెంట్ పై స్పందించిన రాజ్ తరుణ్

ఇటీవల నార్సింగిలోని ఔటర్ రింగ్ రోడ్డులో నటుడు రాజ్ తరుణ్ కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రమాదం అనంతరం రాజ్ తరుణ్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అయితే రాజ్ తరుణ్ ఎలా ఉన్నాడు అని ఆయన అభిమానుల్లో టెన్షన్లు మొదలైంది. దీంతో రాజ్ తరుణ్ తన సోషల్ మీడియా ద్వారా స్పందించి తాను క్షేమంగా ఉన్నట్టు తెలిపాడు. రాజ్ తరుణ్ మాట్లాడుతూ… “నా యోగక్షేమాలు తెలుసుకోవడానికి చాలామంది కాల్స్ చేస్తున్నారు, ఇంత మంది ప్రేమను పొందినందుకు నేను చాలా అదృష్టవంతుడిని. నార్సింగి సర్కిల్ లో గత 3 నెలలుగా చాలా ప్రమాదాలు జరిగాయి. కారు ప్రమాదం అనంతరం నేను అక్కడి నుండీ ఇంటికి చేరుకున్నాను.

నార్సింగి సర్కిల్ లో ఒక్కసారిగా కుడివైపు టర్న్ తీసుకోవాల్సి వచ్చింది. దీంతో నేను కారు పై నియంత్రణ కోల్పోయాను. కారు ఒక్కసారిగా వెళ్ళి పక్కనే ఉన్న గోడను బలంగా ఢీకొట్టింది. అప్పుడు వచ్చిన శబ్దానికి నా రెండు చెవులు పనిచేయలేదు. చూపు కూడా సరిగ్గా కనిపించలేదు. గుండె దడ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ ఘటన జరిగినప్పుడు నేను సీట్ బెల్ట్ పెట్టుకునే ఉన్నాను. నాకు దెబ్బలేమీ తగలల్లేదు. అది నిర్ధారించుకున్న తరువాత కారు నుండీ బయటపడ్డాను. ఆ ఆందోళనలో ఇంటికి పరుగెత్తుకుంటూ వెళ్ళాను. ఆరోజు రాత్రి జరిగింది ఇదే. మిగిలిన విషయాలు త్వరలోనే బయటకు వస్తాయి. త్వరలోనే తిరిగి సినిమా షూటింగులో పాల్గొంటాను. మీ ప్రేమకు ధన్యవాదాలు’ అంటూ రాజ్ తరుణ్ ట్వీట్ చేశాడు. సీటు బెల్టే నన్ను ప్రమాదం నుండీ కాపాడింది, అందరూ సీట్ బెల్ట్ కచ్చితంగా ధరించాలి’ అనే మెసేజ్ కూడా ఇచ్చాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus