తెలుగుతోపాటు తమిళ, కన్నడ భాషల్లోనూ బిజీ అవుతున్న రాజ్ తరుణ్

కుర్రాడు మొదట్లో సాధించిన వరుస విజయాలు చూసి.. టాలీవుడ్ కి మరో ఉదయ్ కిరణ్ దొరికాడు అనుకొన్నారు. అయితే.. వచ్చిన విజాయలను సరిగా క్యాష్ చేసుకోలేకపోయాడు రాజ్ తరుణ్. స్క్రిప్ట్ సెలక్షన్ లో జాగ్రత్త వహించకపోవడంతో కెరీర్ స్లో అయిపోయింది. ఇక వరుసబెట్టి సినిమాలన్నీ ఫ్లాప్స్ అవుతుండడంతో సినిమా ఆఫర్లు కూడా తగ్గిపోయాయి. “లవర్” డిజాస్టర్ తర్వాత రాజ్ తరుణ్ ని తెలుగు ఇండస్ట్రీలో పట్టించుకొనే నిర్మాత లేకపోయాడు.

దాంతో మళ్ళీ దిల్ రాజు స్వయంగా “ఇద్దరి లోకం ఒక్కటే” అనే సినిమా ఎనౌన్స్ చేసేవరకూ రాజ్ తరుణ్ కి తెలుగులో మరో ఆఫర్ రాలేదు. ఇప్పుడు రాజ్ తరుణ్ చేతిలో మూడు తెలుగు సినిమాలున్నాయి. వీటితోపాటు తమిళంలో విజయ్ ఆంటోనీతో కలిసి ఒక సినిమా సినిమా చేసేందుకు ఇటీవల సమ్మతించిన రాజ్ తరుణ్.. ఇప్పుడు “బ్రోచేవారెవరురా” కన్నడ రీమేక్ లో సత్యదేవ్ పాత్రను రీప్రైజ్ చేయనున్నాడు. సుమంత్ శైలేంద్ర కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సుమంత్ శైలేంద్ర నిర్మించనున్నారు. ఇలా తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ సూపర్ బిజీ అయిపోయిన రాజ్ తరుణ్ కెరీర్ మళ్ళీ సూపర్ హిట్ బాట పడితే బాగుండు.

మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus